యాదాద్రి జిల్లా:శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు బాలాలయంలో జరిగే తిరుకళ్యాణ మహోత్సవంలో స్వామివారి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించి,అనంతరం కళ్యాణంలో పాల్గొంటారని ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు.ఈనెల 21న మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరుపనున్నట్లు సమాచారం.
యాగాలు,హోమాలు, పూజలకు కావలసిన ఏర్పాటుతో పాటు,యాదాద్రికి వచ్చే భక్తులకు కల్పించే వసతులపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.ప్రధానంగా యాదాద్రి గర్భాలాయంలో బంగారు తాపడం పనులు,తదితర అంశాలపై సమీక్షిస్తారని తెలుస్తోంది.