మానవత్వం లేని ప్రభుత్వం ఇది: భువనగిరి ఎంపీ

నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని బర్కత్ పుర స్టార్ ఫ్రూట్ మార్కెట్ లోకొద్ది రోజుల క్రితం ఏసీ కంప్రెషర్ పేలిన ఘటనలో కలీం,సాజిద్ అనే ఇద్దరు మృతి చెందారని,ఈ విషయం తెలిసి ఎంతో బాధపడ్డానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Komatireddy Venkat Reddy )అన్నారు.గురువారం బాధిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి, వారికి దైర్యం చెప్పారు.

 This Is An Inhuman Government: Bhuvanagiri Mp , Komatireddy Venkat Reddy , Congr-TeluguStop.com

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నా వంతుగా ఇప్పటికే రెండు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించానని,ఆ కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని అన్నారు.

కలీం,సాజిద్ పిల్లల చదువుకు అయ్యే ఖర్చు అంతా నేనే భర్తిస్తానని హామీ ఇచ్చారు.ఈ ఘటనపై కలెక్టర్ కు, ముఖ్యమంత్రికి లేఖ రాశానని,కనీసం రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా, డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చిv రెండు కుటుంబాలను ఆదుకోవాలని కోరారని,ఇంతవరకు ముఖ్యమంత్రి గానీ,కలెక్టర్ గానీ స్పందించలేదని,ఇంత జరిగినా ప్రభుత్వం నుంచి ఎవరూ వచ్చి కలవలేదని, ప్రభుత్వం ఉన్నది పేదవాళ్లు ఆపదలో ఉంటే ఆదుకోవడానికేనని,కనీసంఅసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి తీరిక లేదా? ఇది మానవత్వం లేని ప్రభుత్వం మని ఆగ్రహం వ్యక్తం చేశారు.కలీం,సాజిద్ కుటుంబాలకు అండగా నేనుంటానని,ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ) కి మరోసారి లేఖ రాస్తానని,ఆయన అపాయింట్మెంట్ ఇస్తే కలిసే ప్రయత్నం చేస్తానని, రాబోయే కాంగ్రెస్( Congress ) ప్రభుత్వంలో ప్రతీ పేదవాడికి అండగా ఉంటామని,పేదలకు అండగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉండాలి తప్ప,ప్రతీది రాజకీయంగా ఉండకూడదని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube