నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.హై స్పీడ్‌తో వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై హనుమాన్‌పేట బైపాస్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది.
ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి టూ టౌన్ పోలీసులు చేరుకున్నారు.ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.అయితే,27 మంది ప్రయాణికులతో బస్సు హైదరాబాద్ నుండి బాపట్ల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ప్రమాదానికి డ్రైవర్ అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.