మహాత్మ జ్యోతిబాపూలే అంబేద్కర్ జన జాతరను జయప్రదం చేయండి...!

నల్లగొండ జిల్లా:సమాజాన్ని విజ్ఞానం వైపు మళ్ళించి,అజ్ఞానుల ఆట కట్టించాలని,సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్న అంతరాల,దోపిడీదారుల కుట్రలకు సబ్బండ కులాలు బలవుతున్నాయని, మూఢనమ్మకాలు,అజ్ఞానం వైపు ప్రజలను తీసుకెళ్తున్నారని విజ్ఞానం వైపు మళ్ళించడమే జన జాతర ఉద్దేశమని రిటైర్డ్ ఐఏఎస్ చోలేటి ప్రభాకర్, గురుకులాల ప్రిన్సిపల్ గాదె లింగస్వామి, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకులు,మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లెపాక వెంకన్న అన్నారు.ఆదివారం కెవిపిఎస్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుండి ఎన్జీ కాలేజీ వాకర్స్ కి పూలే అంబేడ్కర్ జనజాతర కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది.

 Mahatma Jyotiba Phule Make The Jana Jatara A Victory...mahatma Jyotiba Phule , N-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దేశం అభివృద్ధి జరగాలన్నా,సమ సమాజం నిర్మాణం జరగాలన్నా చదివే ప్రాధాన్యమని,చదువులోని శాస్త్ర,సాంకేతిక విజ్ఞానమే ప్రధానం తప్ప మూఢనమ్మకాలు, జ్యోతిష్యాలు కావన్నారు.చరిత్రని తుడిపి వేయాలని చూస్తున్న మనువాదులు చరిత్రలో కనుమరుగవడం ఖాయమని అన్నారు.

ఏప్రిల్ 28న నల్లగొండ ఎస్బిఆర్ ఫంక్షన్ హాల్లో పూలే అంబేడ్కర్ జన జాతర జయప్రదం చేయవలసిందిగా ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ కాసిం ఉస్మానియా యూనివర్సిటీ,తప్పెట్ల స్కైలాబ్ బాబు కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి,ఆర్ శ్రీరామ్ నాయక్ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ చోలేటి ప్రభాకర్ మరియు సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పగడాల నాగేందర్,గాదే లింగస్వామి,అనిత కుమారి,బాబా చక్రహరి, రామారావు,సుధాకర్ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు.ఈ కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎంఎస్పి నియోజకవర్గ ఇన్చార్జ్ బకరం శ్రీనివాస్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగాని జనార్దన్ గౌడ్,ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు మానుపాటి భిక్షమయ్య, కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గారే నరసింహ, గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube