పిల్లలకు ఇళ్ళకు చేరుకున్నారు...పెద్దలూ జాగ్రత...!

నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించడంతో బడులు మూతబడి పిల్లలు ఇళ్ళకు చేరారు.జూన్ 11 వరకు 49 రోజుల పాటు విద్యార్థులకు సెలవులు.

 Parents Should Be Careful About Their Children In Summer Holidays, Parents , Chi-TeluguStop.com

తిరిగి జూన్ 12న బడులు తెరుచుకుంటాయి.వేసవి సెలవుల్లో పిల్లలు సరదాగా స్నేహితులతో కలిసి చల్లదనం కోసం చెరువులు,బావులు,నీటి కుంటలు,స్విమ్మింగ్ పూల్ ల వద్దకు ఈతకు వెళ్ళే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉంటుంది.ఈత రాని పిల్లలు ఈత నేర్చుకోవడం కోసం వెళ్తుంటారు.

ఒక్కోసారి పిల్లలు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోతుంటారు.దీనిని దృష్టిలో ఉంచుకుని పిల్లల తల్లిదండ్రులను శనార్తి తెలంగాణ ముందుగానే అప్రమత్తం చేస్తోంది.

పెద్దలు వెంట లేకుండా పిల్లలను ఎక్కడికి ఒంటరిగా పంపించకండి.ముఖ్యంగా పారే నది, కాలువలు,వరదకాలువలు,నీటి కుంటలు,చెరువులు, బావుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి.

ఒకవేళ పిల్లలకు ఈత నేర్పించాలనుకుంటే పెద్దల సమక్షంలో ఆ ప్రయత్నం చేయడం ఉత్తమం.కొందరు పిల్లలు సరదా కోసం అని ఇంట్లో చెప్పకుండానే వెళుతుంటారు.అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండి,ఈ వేసవిలో తగు జాగ్రత్తలు తీసుకోండి.గతంలో చోటు చేసుకున్న సంఘటనలను యాదిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తలు పాటించండి.

వేసవి వచ్చిందంటే చాలు పట్టణాల్లో ఉన్న ఈత కొలనులు పిల్లల కేరింతలతో మహా బిజీగా ఉంటాయి.ముఖ్యంగా పిల్లలు కూల్ కూల్‌గా కొలనుల్లో ఈత కొట్టేందుకు ఉరకలు వేస్తారు.

పిల్లలు ఉత్సాహాన్ని కాదనలేని పెద్దలు వారిని కొలనుల్లో జలకాలాటలకు అనుమతి ఇస్తారు.అయితే స్విమ్మిగ్ పూల్స్‌లోకి ఈత కొట్టేందుకు పిల్లలను అనుమతించే ముందు కొన్ని అంశాలను ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

స్విమ్మింగ్ పూల్‌లో అడుగు భాగం స్పష్టంగా కనిపించే వాటినే ఎంచుకోండి.పేరెంట్స్ అప్రమత్తంగా లేకుంటే అనర్థాలు జరిగే ప్రమాదం ఉంది తస్మాత్ జాగ్రత్త…!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube