నల్లగొండ జిల్లా:దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా తెలంగాణ రాష్ట్రం సామాజిక,ఆర్థిక,విద్య, ఉపాధి,రాజకీయ,కుల సర్వే నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటరు జాబితాలో ఉన్న జనాభా లెక్కలకు ప్రభుత్వ నిర్వహించిన సర్వే లెక్కలకు పొంతన లేకపోవడానికి కారణం ఒక్కొక్కరికి రెండు చోట్ల ఓటు హక్కు ఉండడమేనని,ఓటు హక్కుకు ఆధార్ కార్డుకు అనుసంధానం చేస్తే ఈ పరిస్థితి ఉండదన్నారు.
గత పది సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఊరటనిచ్చిందని, ఈ ప్రభుత్వం బిపిఎల్,ఏపీఎల్ కార్డులు ఇవ్వాలని నేను ముఖ్యమంత్రికి లేఖ రాశానని చెప్పారు.రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలని, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకలా మాట్లాడడం సబబు కాదన్నారు.
గత ప్రభుత్వం హాయంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 12,728 గ్రామపంచాయతీలో బీసీలకు రిజర్వేషన్ చేసిన స్థానాలు 2625 అని,ఎంపిటిసి ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం స్థానాలు 5781 అందులో బీసీలకు కేటాయించిన స్థానాలు 1224 అని గుర్తు చేశారు.