ఎన్నికల హామీలను తప్పక నెరవేరుస్తాం: సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి

నల్లగొండ జిల్లా:కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని నాగార్జునసాగర్ ఎమ్మేల్యే కుందూరు జైవీర్ రెడ్డి ( MLA Jaiveer Reddy )అన్నారు.ఆదివారం నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండలం ( Gurrampode ) గుండ్లకుంట గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.అనంతరం ఎమ్మేల్యే మాట్లాడుతూ త్వరలోనే ఉచిత కరెంట్,రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ని అందజేస్తామన్నారు.

 We Must Fulfill The Election Promises: Sagar Mlajaiveer Reddy, Nagarjuna Sagar ,-TeluguStop.com

పదేళ్లుగా గ్రామాల్లో కుంటుపడిన అభివృద్ధిని తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కంచర్ల వెంకటేశ్వర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తగుల్ల సర్వయ్య,మాజీఎంపీపీ చనమల్ల జగదీష్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ సూదిని జగదీష్ రెడ్డి,వలిశెట్టి వెంకటయ్య,వైస్ చైర్మన్ యాదవరెడ్డి, వెంకటయ్య,భాస్కర్ రెడ్డి, కమతం జగదీష్,మేడి వెంకన్న తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube