నల్లగొండ జిల్లా: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి సోమవారం రాజీనామా చేశారు.ఈ మేరకు తన రాజీనామా లేఖను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి అందజేశారు.
వెంటనే రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించడంతో ఒక తంతు ముగిసింది.రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు ఆమోదం తెలిపినట్లు స్పీకర్ కార్యాలయం అధికారికంగా ప్రకటన విడుదల చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక సమరానికి శంఖం పూరించినట్లే భావించాలి.
ఇదిలా ఉంటే రాజీనామా ఆమోదం అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గవర్నర్ తమిళి సై అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది.ఇప్పటికే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన రాజగోపాల్ రెడ్డి,ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్న సంగతి తెలిసిందే.
ఇప్పటిదాకా ఒకలెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క అన్నట్లు అన్ని రాజకీయ పార్టీలు తమ తమ అభ్యర్థుల ఎంపిక విషయంలో స్పీడ్ పెంచినట్లు సమాచారం.