కాంగ్రెస్...కాంగ్రెస్...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది.ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.

 Congress...congress...! , Telangana Elections, Congress , Nagarjunasagar, Devara-TeluguStop.com

గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ అహర్నిశలు శ్రమించాయి.ఈసారి 70కు పైగా ఓటింగ్ శాతం నమోదైంది.

గ్రామీణ వాసులు చైతన్యం పొంది ఓటు వేశారు.ఇక చిన్నపాటి ఘర్షణలు తప్పా ప్రశాంతంగా పోలింగ్ ముగియడంతో జిల్లా పోలీసులు, అధికారులంతా ఊపిరిపీల్చుకున్నారు.

దీనితో పోలింగ్ ముగిసిన అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.అంచనాలు తారుమారు కావడంతో ఒక విధమైన ఆందోళన మొదలైంది.

పైకి గాంభీర్యంగా మేమే అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్నా లోలోపల మాత్రం తెలియని టెన్షన్ ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇక దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి.

ఈసారి హస్తం హవా బాగా ప్రభావం చూపినట్లుగా కనిపిస్తోంది.అర్బన్ ఏరియాలో ఎలాగున్నా, రూరల్‌ ఏరియాలో మాత్రం చాలా బిగ్ ఛేంజ్ కనిపించినట్లుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి అర్థమవుతోంది.

ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ గాలి బాగా వీచినట్లుగా తేటతెల్లమవుతోంది.ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయొచ్చని అంచనాలు రావడంతో కాంగ్రెస్ నేతల్లో జోష్ కనిపిస్తుంది.

ఒకవైపు ఎగ్జిట్ పోల్స్,మరోవైపు రూరల్ ప్రాంతాల్లో నమోదైన ఓటింగ్ శాతాన్ని బట్టి ఈసారి అధికారం తమదేనని కాంగ్రెస్ భావిస్తోంది.దీనితో కాంగ్రెస్ నేతలు అభ్యర్ధులను కలిసే పనిలో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పది స్థానాలు గెలుస్తమని ధీమాగా ఉంది.అందులో నల్గొండ, నాగార్జునసాగర్,దేవరకొండ,మిర్యాలగూడ, మునుగోడు,నకిరేకల్, హుజూర్ నగర్,కోదాడ, తుంగతుర్తి,ఆలేరు స్థానాలు కాంగ్రెస్ పక్కాగా గెలుస్తామని చెబుతుండగా,సూర్యాపేట ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉందని, భువనగిరి టఫ్ ఫైట్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ఎవరు రాజు,ఎవరు రాణో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.ప్రజల నాడీ ఎటువైపు ఉందో కౌంటింగ్ ప్రారంభమైన 2,3 గంటలకు తేలనుంది.

ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేకుంటే అట్టర్ ప్లాప్ అవుతాయా అన్నది మరికొన్ని గంటల్లోనే క్లియర్ కట్‌గా తెలిసిపోనుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube