నారీమణులే ఓటు నిర్ణేతలు...!

నల్లగొండ జిల్లా: ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు ఎందులోనూ పురుషులకు తీసిపోవడం లేదు.తలుచుకుంటే ఏదైనా సాదించే సత్తా ఉందని నిరూపించుకుంటున్నారు.

 Women Voters Decide Winners In Miryalaguda Constituency,women Voters , Miryalagu-TeluguStop.com

విద్యా ఉద్యోగాల్లోనే రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు.స్థానిక సంస్థల్లో పురుషులతో సమానంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

చాలాచోట్ల పురుషుల కంటే మహిళా ఓటింగ్ శాతం అధికంగా ఉన్న దగ్గర వారే గెలుపు నిర్ణేతలుగా మారుతున్నారు.ఇప్పుడు జరిగే జనరల్ ఎలక్షన్స్ లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

వీరు అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపనున్నారు.

వారు ఎక్కువగా ఏ పార్టీకి ఓటు వేస్తారో వారే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.

దీంతో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్,బీజేపీ,సిపిఎం మహిళా ఓటర్లపైనే దృష్టిని కేంద్రీకరించాయి.ఆయా పార్టీల నాయకులు ఇంటింటికి వెళ్లి వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.ప్రతి మండలంలో మహిళలే ఎక్కువగా ఉండటం గమనార్హం.తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలో మొత్తం ఓటర్లు 2,31,391ఉండగా మహిళలు 1,17,455 మంది,పురుషులు 1,13,911 మంది ఉన్నారు.3,544 మంది మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.అలాగే ప్రచారంలోనూ వారిని ఎక్కువగా రప్పిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube