మద్యం ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌...

నల్లగొండ జిల్లా:అసెంబ్లీ ఎన్నికల ( Assembly elections )నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్‌ కానున్నాయి.ఈ నెలాఖరులో వరుసగా మూడు రోజులు పాటు ‘డ్రై డే‘గా పాటించనున్నారు.

 Shocking News For Alcohol Lovers Assembly Elections ,central Election Commissio-TeluguStop.com

ఈ నెల 30 పోలింగ్‌ నిర్వహించనున్నారు.

దీంతో ఆ రోజుతో పాటు నవంబర్‌ 28,29 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలు,బార్లు మూసివేస్తారు.

మళ్లీ డిసెంబర్‌ 1న వైన్‌ షాపులు తెరచుకోనున్నాయి.కేంద్ర ఎన్నికల సంఘం(సిఈసి)( Central Election Commission ) ఆదేశాల మేరకు రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మూడు రోజుల పాటు మద్యం విక్రయాలు( Liquor ) జరగకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది.దీనికి సంబంధించి బార్లు,వైన్‌ షాపుల యజమానులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube