నల్లగొండ జిల్లా:అసెంబ్లీ ఎన్నికల ( Assembly Elections )నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.
ఈ నెలాఖరులో వరుసగా మూడు రోజులు పాటు 'డ్రై డే'గా పాటించనున్నారు.ఈ నెల 30 పోలింగ్ నిర్వహించనున్నారు.
దీంతో ఆ రోజుతో పాటు నవంబర్ 28,29 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలు,బార్లు మూసివేస్తారు.
మళ్లీ డిసెంబర్ 1న వైన్ షాపులు తెరచుకోనున్నాయి.కేంద్ర ఎన్నికల సంఘం(సిఈసి)( Central Election Commission ) ఆదేశాల మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మూడు రోజుల పాటు మద్యం విక్రయాలు( Liquor ) జరగకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
దీనికి సంబంధించి బార్లు,వైన్ షాపుల యజమానులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించింది.