నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ పట్టణంలో దోమల నివారణకు చర్యలు చేపట్టి విషజ్వరాలు ప్రబలకుండా అరికట్టాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మున్సిపల్ చైర్మన్,అధికారులను ఆదేశించారు.ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో వారితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన ఆయన,దోమల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో డ్రైనేజ్ సమస్యలు అధికంగా ఉన్న వార్డులో ప్రతిరోజూ శుభ్రపరచాలని,అలాగే ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ దోమలను పూర్తిగా కట్టడి చేసి,డెంగ్యూ,మలేరియా లాంటి విషజ్వరాలను పూర్తిగా కట్టడి చేయాలని సూచించారు.అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కోసం నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్లాస్టిక్ కవర్ల నియంత్రణ కార్యక్రమం, వనమహోత్సవం,మరియు 78 వ,స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.