తాగుడుకు బానిసైన తండ్రి...తల్లీకొడుకు కలిసి దారుణం...!

నల్లగొండ జిల్లా:చింతపల్లి మండలం( Chintapalli mandal ) గాసిరాం తండాకు చెందిన రామావత్ రవీందర్ (48) తాగుడుకు బానిసై నిత్యం భార్యా రామావత్ మంగిని వేధిస్తూ,ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న కొడుకు రామావత్ శశి (23)తో గొడవ పడేవాడు.అదే క్రమంలో బుధవారం రాత్రి కూడా రోజులాగే తాగొచ్చి భార్యా,కొడుకుతో గోడవ పడగా భరించలేని తల్లి కొడుకు క్షణికావేశంలో తండ్రిని విచక్షణా రహితంగా కొట్టడంతో మృతి చెందాడు.

 Drunken Father Mother And Son Together Are Terrible , Nalgonda District , Ci Nav-TeluguStop.com

తల్లీ కొడుకు విషయాన్ని బయటకు పొక్కకుండా గురువారం ఉదయం సాధారణంగా మరణించాడని నమ్మించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా అనుమానం వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతనాంపల్లి సిఐ నవీన్ కుమార్,( CI Naveen Kumar )చింతపల్లి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొనిమృతదేహాన్ని పరిశీలించిశరీరంపై గాయాలను గుర్తించి హత్యగా నిర్దారించడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మృతుని కుమార్తె కొర్ర నిఖిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమ్మితం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి( Devarakonda Government Hospital ) తరలించి,కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube