నల్లగొండ జిల్లా:నల్లగొండ రూరల్ మండలం దోమలపల్లి గ్రామంలో పాటశాల విద్యార్ధులు చేసిన పని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.పాఠశాల పక్కనే రైతులు వడ్లు ఆరబోశారు.
అది ఐకెపి సెంటర్ కావడంతో అమ్మకానికి తెచ్చిన వరి ధాన్యం ఆరబెట్టగా అనుకోకుండా అకాల వర్షం వచ్చింది.దీనితో రైతులు ధాన్యం తడవకుండా పడుతున్న తిప్పలు చూసి చలించిపోయారు.
ఆలస్యం చేయకుండా గవర్నమేంట్ స్కూల్ విద్యార్థులు మూకుమ్మడిగా అక్కడికి చేరుకొని తడుసున్న ధాన్యపు రాసులుపై పట్టాలు కప్పి,రైతు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని తడవకుండా కాపాడి ఔరా అనిపించుకున్నారు.పాఠశాల విద్యార్థులు చేసిన పనికి రైతులు ప్రశంసలు కురిపిస్తే,రోడ్లుపై వెళ్లేవారు విద్యార్థులను అభినందించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇప్పుడు ఈ విద్యార్థుల అంకితభావంతో చేసిన విజువల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.