ఇటీవల రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు.అందుకు కారణాలు అనేకం.
అయితే తెల్ల జుట్టు వృద్ధాప్యానికి సంకేతం.చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చిందంటే ముసలి వారిలా కనిపిస్తారు.
ఈ క్రమంలోనే ఇరుగుపొరుగు వారు చేసే కామెంట్లు అన్నీ ఇన్నీ కావు.దీంతో తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు ముప్ప తిప్పలు పడుతుంటారు.
అందుకే తెల్ల జుట్టు వచ్చాక బాధపడడం కన్నా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు.
అయితే తెల్ల జుట్టు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేయడానికి ఇప్పుడు చెప్పబోయే హెయిర్ టోనర్ అద్భుతంగా సహాయపడుతుంది.
ఈ హెయిర్ టోనర్ ను వారానికి ఒక్కసారి వాడితే తెల్ల జుట్టు సమస్యకు దూరంగా ఉండవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ టోనర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకుంటే పీల్ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే అంగుళం అల్లం ముక్కను కూడా తీసుకుని తొక్క చెక్కేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు మరియు మూడు లేదా నాలుగు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి.చివరిగా అరకప్పు వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ ను వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన హెయిర్ టోనర్ సిద్ధమవుతోంది.

ఈ హెయిర్ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు తయారు చేసుకున్న టోనర్ ను ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి తలస్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ హెయిర్ టోనర్ ను వాడితే.అందులో ఉండే పలు సుగుణాలు తెల్ల జుట్టు కు అడ్డుకట్ట వేస్తాయి.వయసు పెరిగిన జుట్టు నల్లగా మెరిసేలా చేస్తాయి.
ఈ హెయిర్ టోనర్ వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుముఖం పడుతుంది.చుండ్రు సమస్య ఉన్న సరే కొద్ది రోజుల్లోనే దూరమవుతుంది.







