ఆర్డీవో మీటింగ్ ను బహిష్కరించిన పేదలు

నల్లగొండ జిల్లా:చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని 415,396 సర్వే నెంబర్లలోని 100 ఎకరాల అసైన్డ్ దారుల మీటింగ్ నల్లగొండ ఆర్డీవో కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేశారు.ఈ సమావేశాన్ని బాధిత అసైన్డ్ భూముల పట్టాదారులు బహిష్కరించి,తమ నిరసనను తెలిపారు.

 The Poor Boycotted The Ardeavo Meeting-TeluguStop.com

ఈ సందర్భంగా ప్రజా పోరాట సమితి (పీఆర్ పీఎస్)రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి మాట్లాడుతూ ఆ భూముల్లోనే వ్యవసాయం చేసుకుంటూ అసైన్దారులు ఉపాధి పొందుతున్నారన్నారు.వెలిమినేడులో ఉన్న 18 ఫ్యాక్టరీలు వెదజల్లే కాలుష్యం ఒకవైపు ఇబ్బంది పెడుతుంటే,కొత్తగా ఏర్పడే పరిశ్రమల వలన గ్రామంలో ఉండలేమని ఇండస్ట్రియల్ పార్క్ ను ప్రభుత్వం రద్దు చేసుకోవాలని,బలప్రయోగం చేయడానికి ప్రయత్నిస్తే త్రిప్పికొడుతామని” హెచ్చరించారు.

ఇందులో భూపోరాట కమిటి అధ్యక్షుడు అంశాల సత్యనారాయణ,సభ్యులు అర్రూరి శివకుమార్ ప్రజాపతి,గుఱ్ఱం వెంకటేశ్ ముదిరాజ్, మెట్టు శ్రీశైలం,మెట్టు సైదులు,మేడి స్వామి,మేడి కృష్ణ,మంకాల యాదయ్య,మేడి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube