ఎర్న్ ఫీచర్’తో క్రిప్టో అసెట్స్ పై క్రిప్టో ఆర్జనలను జనరేట్ చేసుకునేలా వినియోగదారులకు అవకాశం అందిస్తున్న కాయిన్ డీసీఎక్స్

ముంబై, ఇండియా – మే 26, 2022: భారతదేశ అతిపెద్ద, అత్యంత విలువైన క్రిప్టో కంపెనీలలో ఒకటైన కా యిన్ డీసీఎక్స్ నేడిక్కడ తన నూతన Crypto yield program ‘ఎర్న’ ను ఆవిష్కరించింది.కాయిన్ డీసీఎక్స్ కస్ట మర్లు తమ క్రిప్టో పని చేసేలా, క్రిప్టో అసెట్స్ పై వడ్డీ ఆర్జించేలా చేసే నూతన మార్గమిది.

 Coin Dcx Offers Customers The Opportunity To Generate Crypto Earnings On Crypto-TeluguStop.com

ఎర్న్’ ఫీచర్ అనేది ప్రస్తుతం పరిశ్రమలో అత్యంత పోటీదాయక ఉత్పత్తుల్లో ఒకటి.ఇది వినియోగదారులకు ఇండస్ట్రీ లీడింగ్ రేట్స్ ను మాత్రమే గాకుండా, యూజర్లకు పూర్తి స్థాయి సరళత్వాన్ని, ఎలాంటి లాక్ ఇన్ పీరి యడ్స్ లేకుండా తమ క్రిప్టోపై నియంత్రణను అందిస్తుంది, ఏ సమయంలోనైనా విత్ డ్రాయల్స్ చేసుకోవచ్చు.

యూజర్లు ‘ఎర్న్’ ఫీచర్ ను ఎంచుకుంటే, క్రిప్టో / డిజిటల్ అసెట్స్ పై ఆర్జనలను అందించేందుకు గాను పెద్ద పెద్ద సంస్థాగత రుణగ్రహీతలతో, థర్డ్ పార్టీ లెండింగ్ భాగస్వాములు, స్టేకింగ్ ప్లాట్ ఫామ్స్ తో కాయిన్ డీసీఎక్స్ కలసి పని చేస్తుంది.భారతదేశ అగ్రగామి క్రిప్టో ఎక్స్ ఛేంజ్ గా వినియోగదారుల అసెట్స్ ను కాపాడేందుకు, యూజర్ల ఫండ్స్ భద్రతకు గాను అత్యంత కఠిన రీతిలో ఆస్తుల రక్షణ చర్యలు తీసుకునేందుకు కాయిన్ డీసీఎక్స్ కట్టుబడి ఉంది.

ఈ సందర్భంగా కాయిన్ డీసీఎక్స్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సుమిత్ గుప్తా మాట్లాడుతూ ‘‘నేటి ఆవిష్కరణ అనేది మన కమ్యూనిటీకి వినూత్న ఉత్పాదనలను, పరిష్కారాలను అందించేందుకు గాను మన జట్టు చే స్తున్న కఠోర పరిశ్రమకు నిదర్శనం లాంటిది.డిజిటల్ అసెట్స్ క్రమంగా ప్రధాన స్రవంతిగా మారుతున్నాయి.

తమ క్రిప్టో హోల్డింగ్స్ పైవిశ్వసనీయమైన, యాక్సెసబుల్ మార్గాన్ని వ్యక్తులకు అందిస్తున్నందుకు గాను మే మెంతో ఆనందిస్తున్నాం’’ అని అన్నారు.కాయిన్ డీసీఎక్స్ ‘ఎర్న్’ ప్రస్తుతం ఎక్స్ క్లూజివ్ గా వెయిట్ లిస్ట్ యూజర్లకు లభ్యమవుతుంది.

అధిక సం ఖ్యలో యూజర్ రెఫరల్స్ కలిగి ఉండే యూజర్లకు ప్రయారిటీ యాక్సెస్ అందించబడుతుంది.రెఫరల్ ప్రోగ్రామ్ గురించి, అందులో చేరడం గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు ఈ లింక్ చూడండి లేదా దిగువ యూఆర్ఎల్ ను క్లిక్ చేయండి.

ఈ ఉత్పాదనను యాక్సెస్ చేసేందుకు గాను రిజిస్ట్రేషన్ మరియు కేవైసీ పూర్తి చేసి ఉండడం తప్పనిసరి.కాయిన్ డీసీఎక్స్ యొక్క ‘ఎర్న్’ ఆవిష్కరణ అనేది కంపెనీ యొక్క తాజా ఆవిష్కరణ అయిన క్రిప్టో ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (సీఐపి) కి తరువాతి ఆవిష్కరణ.

సిఐపి అనేది ఒక విశిష్ట ఉత్పాదన.క్రమం తప్పని కాల వ్యవ ధుల్లో నిర్దేశిత మొత్తాలను ఇన్వెస్ట్ చేసేందుకు ఇది ఇన్వెస్టర్లకు తోడ్పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube