నల్లగొండ జిల్లా:మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ప్రకటించి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ శుక్రవారం బీఫారం అందజేయనున్నట్లు తెలుస్తోంది.పార్టీ పేరు మార్పుపై సీఈసీ నుంచి ఆమోదం లభిస్తే బీఆర్ఎస్ పేరు మీద బీఫారం ఇవ్వాలని కేసీఆర్ తొలుత భావించారు.
కానీ,అందుకు కొంత సమయం అవసరమని,ఇదే పేరుతో గానీ,దానికి దగ్గరగా గానీ,ఏమైనా పేర్లు ఉన్నాయేమో పరిశీలించి,తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని సీఈసీ పేర్కొన్నట్లు తెలిసింది.దీంతో అభ్యర్థిని వెంటనే ఖరారు చేసి టీఆర్ఎస్ బీఫారం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.