గుట్టపై జరుగుతున్న గుట్టు వీడేదెప్పుడు? గుట్ట ఈఓపై ఎందుకంత వ్యతిరేకత? గుట్టపైకి వెళ్ళడానికి ఆంక్షలు విధించడం వల్ల జరిగే లాభం ఏమిటి?

యాదాద్రి జిల్లా:ప్రశాంతతకు,ఆధ్యాత్మికతకు కొలువై ఉండాల్సిన యాదగిరిగుట్ట నిత్యం పోలీసుల బూట్ల చప్పుడుతో,నిరసనకారుల ఆందోళనలతో నిషేధిత ప్రాంతంగా,ఉద్రిక్తతలకు నిలయంగా మారిందనడంలో అతిశయోక్తి లేదేమో!ప్రపంచం అబ్బురపడేలా వేల కోట్ల రూపాయలతో అత్యంత విశాలంగా,సుందర నందనవనంలా రూపుదిద్దుకొని,భక్తుల,ప్రజల దర్శనార్థం పున:ప్రారంభమైన యాదాద్రి కొండ సమస్యలకు నెలవుగా మారడంతో తెలంగాణ సమాజం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.భక్తి భావంతో అలరారుతుందని అందరూ ఎదురుచూసిన యాదాద్రి ఎందుకు సమస్యాత్మక ప్రాంతంగా మారిందంటే కేవలం ఆలయ ఈఓగా విధులు నిర్వహిస్తున్న గీత అనే అధికారి తీసుకుంటున్న అనధికార నిర్ణయాలే కారణమని గుట్టపై ఏ చెట్టునడిగినా,పుట్టనడిగినా ఇట్టే చెప్పేస్తాయని గుట్టపైకి వెళుతున్న భక్తులు,ప్రజలు టక్కున చెప్పేస్తున్నారు.

 When Is The Gossip Going On On The Hill Going Away? Why The Opposition On Gutta-TeluguStop.com

మరి ఆలయ పేరు ప్రఖ్యాతులు పెంచి,గుట్ట ఖ్యాతిని నలుమూలల వ్యాప్తి చేయాల్సిన ఆలయ ఈఓ ఎందుకు అలాంటి అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయిందని అంటున్నారు భక్తులు.ఆలయ ప్రతిష్టను,భక్తుల,ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఈఓ చేపడుతున్న చర్యలు దేవాదాయ ధర్మాదాయ శాఖా అధికారులకు తెలియదా? లేక తెలిసి కూడా మొద్దు నిద్ర నటిస్తున్నారా? అనే ధర్మ సందేహం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలను వేధిస్తోంది.ప్రతీ రోజు ఏదో ఒక రూపంలో ఆలయ ఈఓ గీతకు వ్యతికరేకంగా భక్తులు,రాజకీయ పార్టీల నేతలు, చివరికి జర్నలిస్టులు కూడా నిరసన ప్రదర్శనలు నిర్వహించడం పరిపాటిగా మారినా ఆమె నిర్ణయాలు మారకపోవడం,ఆమె విధించే ఆంక్షలు అలాగే కొనసాగడం,పోలీసులు నిరసనకారులను అరెస్టులు చేయడం రోజు వారీ దిన చర్యగా మారింది.అందులో భాగంగా శనివారం కూడా కొండపైన ఈవో కార్యాలయం ముందు యూత్ నాయకులు ధర్నాకు దిగారు.

దీనితో మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయింది.రంగంలోకి దిగిన పోలీసులు ధర్నా చేస్తున్న యూత్ నాయకులను అరెస్ట్ చేసి తుర్కపల్లి పోలస్ స్టేషన్ కు తరలించారు.

ఇంత జరుగుతున్నా యాదగిరిగుట్టపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టకపోవడం ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం,ఆలయ ఈఓ తన దూకుడును కొనసాగించడం,భక్తులకు,ప్రజలకు ఇబ్బందులు ఎదురవ్వడం షరా మామూలుగా మారాయి.ఇప్పటికైనా జిల్లా మంత్రి,దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి,ఎండోమెంట్ ఉన్నతాధికారులు స్పందించి ఆలయ ఈఓ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై సమగ్ర విచారణ జరిపి,గుట్టపై జరుగుతున్న అసలు గుట్టు ఏమిటో తెలంగాణ సమాజానికి తెలియజేస్తూ,గుట్టపై ప్రశాంత వాతావరణం నెలకొనే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదిలా ఉంటే యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తున్నారని తెలుసుకొన్న కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి వచ్చి ఘన స్వాగతం పలికారు.

వారితో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.అంతకుముందు ఆటోలను కొండపైకి నిషేధించిన యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి నిర్ణయాన్ని నిరసిస్తూ యాదగిరిగుట్టలో ఆందోళన చేస్తున్న ఆటో కార్మికులను కలిసి సంఘీభావం తెలిపారు.

ఎంపీ వాహన శ్రేణిని కూడా పోలీసులు అడ్డుకోవడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube