నల్లగొండ జిల్లా:తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు( Nara Chandrababu Naidu ) నాల్గవసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్చార్జి మువ్వా అరుణ్ కుమార్ గపిలుపు మేరకు హాలియా పట్టణ అధ్యక్షుడు వేముల రామస్వామి ఆధ్వర్యంలో పసుపు శుభానికి మంచిదని పులిహోర అన్న ప్రసాదం కార్యక్రమంతో పాటు ప్రజలకు అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమంలో అనుముల మండల పార్టీ అధ్యక్షులు ఉడుతూరి నర్సింహారెడ్డి, నిడమానూరు మండల పార్టీ అధ్యక్షుడు మంద తిరుపతయ్య,తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కంచర్ల వెంకన్న,డాక్టర్ శ్రీధర్, సీనియర్ నాయకులు కర్ణ రమణారెడ్డి,బచ్చు సతీష్, హాలియా మున్సిపాలిటీ 11 వ వార్డు సభ్యులు పెద్దలు చెన్నయ్య,అక్కయ్య బాబు, అశోక్, చంద్రమౌళి,కోటపాటి మధు,ఐతరాజు వేణు,రూబెన్, వేముల అఖిల్,హాలియా పట్టణ అధ్యక్షకార్యదర్శులు వేముల రామస్వామి,ముజ్జా రవి తదితరులు పాల్గొన్నారు.