నల్లగొండ జిల్లా: రాష్ట్రంలో మాదిగ జాతికి నిత్యం అందుబాటులో ఉంటూ జాతి ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై నిరంతరం పోరాడుతానని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ అన్నారు.నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని పాల కేంద్రంలో సంఘం రాష్ట్ర నాయకులు కమ్మలపల్లి వెంకటయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యా,వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ మాదిగ జాతి ఆణిముత్యాలను వెలికితీసేందుకు సహాయం చేస్తానని,ఆర్థికంగా ఇబ్బంది పడే పేద విద్యార్థులకు, ఉపాధి లేక నిరుద్యోగులుగా ఉంటున్న యువతకు అండగా ఉండి, ఉపాధి కల్పించేంతవరకు బాధ్యత తీసుకుంటానని తెలిపారు.
ఎమ్మార్పీఎస్ ఆవిర్భావించి 30వ, వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జూలై 7న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే ఆవిర్భావ దినోత్సవ దండోరా రథోత్సవాలకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలో మాదిగ కులంలో పుట్టిన ప్రతి మాదిగ బిడ్డ పల్లె నుండి ఢిల్లీ వరకు మన మహా శబ్దం డప్పు దండోరా జెండా ఎగరేసి ప్రతి ఇంట ఒక పండుగలా సంబురాలు చేయాలని కోరారు.
తన మాదిగ జాతి చాటింపులకు, పెళ్లిళ్లకు,చావులకు పరిమితం కాకుండా విద్యలో రాణించి, అంబేద్కర్ మహనీయుడి అడుగు జాడల్లో నడుస్తూ అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు.ఎమ్మార్పీఎస్ ముఖ్య ఉద్దేశ్యం విద్య,వైద్యం మాత్రమేనని,దానితోటే రాజ్యాధికారం సాధించుకోవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గెలువయ్య,జిల్లా అధ్యక్షుడు సైదులు,ఎర్ర యాదగిరి,ఏలేటి నరసింహ, పీఏపల్లి,కొండమల్లేపల్లి, చందంపేట మండలాల అధ్యక్షులు మద్దిమడుగు సాయి,సంజీవ,నగేష్,సీనియర్ నాయకులు కర్ణయ్య,కాశయ్య, ఏసు,కృష్ణయ్య,జగన్,కత్తుల రమేష్,మాతంగి హరికృష్ణ, సైదులు,శంకర్,రవికుమార్ గిరి,శీను తదితరులు పాల్గొన్నారు.