ధర్మవరపు సుబ్రహ్మణ్యం( Dharmavarapu Subrahmanyam )…తెలుగు ఇండస్ట్రీ లో తిరుగులేని కమెడియన్ గా ఆయనకు మంచి పేరు వుంది.దాదాపు అయన కన్ను మూసి దశాబ్ద కాలం గడుస్తున్నా కూడా అయన చేసిన సినిమాల ద్వారా ప్రతి ఒక్కరిని నవ్వులు పూయిస్తూనే ఉన్నారు.
అయితే ధర్మవరపు సుబ్రహ్మణ్యం తన జీవితంలో మూడు అతి పెద్ద ప్రమాదాలను ఎదుర్కొన్నారు.వాటి వల్ల కొన్నాళ్ల పాటు సినిమాలకు కూడా దూరం అయ్యారు.
మొదటి సారిగా 2001 లో ఆయనకు ఒక పెద్ద ప్రమాదం జరిగింది.ఉదయ్ కిరణ్ అయన నటించిన నువ్వు నేను( nuvvu nenu ) సినిమా విజయం సాధించడం తో ఒక సక్సెస్ పార్టీ చేసాడు.
అందుకోసం ధర్మవరపు సుబ్రహ్మణ్యం ని కూడా పిలిచాడు.

ఆ పార్టీ జరిగి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమం లో తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో గోరమైన ప్రమాదానికి గురయ్యాడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం.ఏకంగా అయన ప్రయాణం చేస్తున్న కారు పై నుంచి ఒక బస్సు వెళ్లడం తో కారు నుజ్జు నుజ్జు కావడం తో పాటు కారు నడుపుతున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం సైతం బాగా ఇంజురీ అయ్యారు.అయన తల యొక్క స్కల్ పై 21 కుట్లు పడ్డాయి .అలాగే కుడి చేయి యొక్క ఎముక ఏడూ ముక్కలు అయ్యింది.ఈ ప్రమాదం నుంచి అయన ఎలా బ్రతికి బయట పడ్డారో నిజముగా ఒక మిరకిల్ అని చెప్పుకోవచ్చు.
ఆ తర్వాత కొన్నాళ్ళకు బాగానే కోలుకొని మళ్లి సినిమాలు చేస్తున్న టైం లో శ్వేతా నాగు( Swetha Nagu ) అనే సౌందర్య సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించాడు.

ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అడవి లోనే జరిగింది.అయితే అక్కడ ఒక పురుగు ఎదో ఆయన్ని కుట్టింది.అది గమనించని ధర్మవరపు సుబ్రహ్మణ్యం తన రూమ్ లోకి వెళ్ళిపోయి పడుకున్నారు.
ఆలా అయన ఏకంగా తొమ్మిది రోజుల పాటు కోమాలోకి వెళ్లిపోయారు.ఆ తర్వాత కొన్ని పరీక్షలు చేస్తే అయన హెవీ స్మోకింగ్ వల్ల లంగ్స్ మొత్తం పాడైపోయాయని తేలింది.
ఇక ఇలా రెండో సారి కూడా అయన ప్రాణాలతో బయటపడ్డారు.కానీ మూడో సారి క్యాన్సర్ రూపం లో వచ్చింది మహమ్మారి.
దాని నుంచి కోలుకోలేకపోయారు.చివరికి కొంత సఫర్ అయినా తర్వాత ధర్మవరపు సుబ్రహ్మణ్యం 2013 లో కన్ను మూసారు.