నల్లగొండ జిల్లా:రిపోర్టర్ మెరుగుమళ్ల భిక్షమయ్యను విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ కు పిలిపించి అకారణంగా విచక్షరహితంగా దాడి చేసి గాయపరిచిన కేతేపల్లి ఎస్ఐ అనిల్ రెడ్డిపై సమగ్ర విచారణ జరిపి వెంటనే సస్పెండ్ చేయాలని ఐక్య దళిత సంఘాల వేదిక నాయకులు డిమాండ్ చేశారు.కేతేపల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి దాడిలో తీవ్రంగా గాయపడి నల్గొండ ప్రభుత్వ ధవాఖానలో చికిత్స పొందుతున్న దళిత రిపోర్టర్ మెరుగుమళ్ళ భిక్షమయ్యను బుధవారం వారు పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నల్లగొండ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, మాలమహనాడు జాతీయ అద్యక్షులు తాళ్లపల్లి రవి,జిల్లా నాయకులు గోలి సైదులు,చింతపల్లి లింగమయ్య,చింతపల్లి బాలకృష్ణ,బోగరి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.