నల్లగొండ జిల్లా:మోడీ సహకారంతో లక్షల డబుల్ బెడ్రోమ్ ఇండ్లు కట్టిస్తామని,మునుగోడు ప్రజల ఆత్మగౌరవం నిలిపి రాజగోపల్ రెడ్డిని గెలిపించి దీపావళి పండుగ చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు.నాంపల్లి మండలం తిరుమలగిరి గ్రామంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఆడ బిడ్డలకు బతుకమ్మ,దసరా శుభాకాంక్షలు తెలిపారు.
పండుగ సందర్భంగా గ్రామాలకు వెళుతున్న ప్రజలను ఆపి పోలీసులు ఫైన్స్ రూపంలో కోట్లు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు.మిషన్ భగీరథ ద్వారా చాలా చోట్ల నాచు పట్టిన నీళ్లు వస్తున్నవని,పైపు లైన్ సరిగా లేక మురికి నీరు వస్తున్నవని,పాత ట్యాంక్ లకు రంగులు వేసి కేసీఆర్ మిషన్ భగీరథ పేర్లు రాసిండని,ఆ కాలంలోనే మాజీ స్పీకర్ మనోహర్ ఫ్లోరైడ్ విముక్తికి పోరాటం చేశారని గుర్తు చేశారు.
చర్లగూడెం,లక్ష్మణపురం ప్రాజెక్ట్ పనులు 20% కూడా కాలేదని,నక్కలగండి,ఎస్సెల్బీసీ సొరంగ మార్గం పూర్తి కాలేదని,దీనిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చాలా కొట్లాడిండన్నారు.బీజేపీ దేశంలోని 19 రాష్ట్రాలలో పరిపాలిస్తున్న పార్టీ అని,బీజేపీ అధికారంలోకి రాగానే పెన్షన్లు 1 వ తారీఖు వరకు ఇస్తామని,ఆర్టీసీలో పనిచేసిన తల్లిదండ్రులకు,సింగరేణి రిటైడ్ఉద్యోగులకు పెన్షన్ ఇస్తామన్నారు.
ఇప్పుడు కళ్యాణలక్ష్మీ రావడానికి సంవత్సర కాలం పడుతుందని,బీజేపీ అధికారంలోకి వస్తే పెళ్ళిపందిరిలోనే ఇస్తామని తెలిపారు.బడాబాబులకు ఇస్తున్న రైతుబంధును పేద రైతులకు అందేలా చేస్తామన్నారు.
కౌలు రైతులకు బీజేపీ పార్టీ అండగ ఉంటుందని,కేసీఆర్,కేటీఆర్ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో ఎంతమంది పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.రైతుల రుణమాఫీ కాలేదని,34 లక్షల మంది రైతులు ఎగవేత గురైనారని బ్యాంకర్లు రైతులను వేధిస్తున్నారని చెప్పారు.3500 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలను వెంటనే చెల్లించాలన్నారు.గొల్ల కురుమలకు చెక్కులు పంపిణీ చేయడం సంతోషమని,తెలంగాణ వ్యాప్తంగా గొల్ల కురుమలకు లక్ష 75 వేలు బెనిఫిషర్లకి నేరుగా పంపాలని సూచించారు.గిరిజనుల ఓట్లను దృష్టిలో పెట్టుకొని గిరిజన బంధు అంటున్నారని,పేద ప్రజలకు కూడా పేద బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్ గోల్మాల్ అవుతాడని, మునుగోడు ఎన్నికలలో కేసీఆర్ కి కర్రుకాల్చి వాత పెడతారని,కేసీఆర్ తెలంగాణ గాంధీ,దేవుడు అని చెప్పుకుంటుండని,తెలంగాణ గాంధీ కాదు తెలంగాణ ద్రోహి అని ఫైర్ అయ్యారు.బీఆర్ఎస్ పార్టీ పెట్టి దేశాన్ని తాగుబోతులను చేస్తాడని ఎద్దేవా చేశారు.