నల్లగొండ జిల్లా:అనుముల మండలంలోని హాలియా మున్సిపల్ లో ముందస్తు పన్ను చెల్లించే వారికి ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తోంది.పన్ను చెల్లించే మొత్తం రాయితీని ప్రకటించింది.ఆస్తిపన్ను రాబట్టుకునేందుకు, మున్సిపాలిటీ ఆదాయాన్ని సమకూర్చేందుకు మున్సిపల్ శాఖ ఎర్లీబర్డ్ పథకాన్ని ప్రవేశపెట్టింది.2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ పథకంలో భాగంగా ముందస్తు పన్ను చెల్లించే వారికి ఐదు శాతం రాయితీ కల్పించింది.ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన గడువు ఇక నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో హాలియా మున్సిపాలిటీ పట్టణంలో అనేక మంది ఆస్తి పన్ను చెల్లించడానికి ముందుకు వస్తున్నారు.ఈనెల 30 వరకు ఈ పథకం అమలు ఉండడంతో దీని గురించి హాలియా మున్సిపాలిటీ లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
అధికారిక లెక్కల ప్రకారం హాలియా మున్సిపాలిటీలో ఈ ఏడాది రూ.ఒక కోటీ 99లక్షలు ఆస్తి పన్ను డిమాండ్ ఉంది.హాలియా మున్సిపాలిటీలో మొత్తం 5.415 అసెస్మెంట్స్ ఉండగా వీటిలో ప్రభుత్వాలకు సంబంధించినవి 16 ఉన్నాయి.ఐదు శాతం రాయితీ ఇవ్వడం ద్వారా ఆస్తి పన్ను చెల్లించడానికి పట్టణ ప్రజలు ముందుకు వస్తున్నారు.దీంతో ఈనెల 21వ తేదీ వరకు మున్సిపాలిటీలో ఆస్తి పన్ను చెల్లింపులో సుమారు రూ.35 లక్షలపైగా పన్ను వసూల్ అయినట్లు అధికారులు తెలిపారు.
మున్సిపాలిటీ నిర్వహణ,పౌరులకు అందించే సేవలు సక్రమంగా కొనసాగాలంటే సొంత ఆదాయ వనరులు కీలకం.
ఈ మేరకు పన్నులు,ఇతర ఖాతాల ద్వారా సాధారణ నిధి నిధులు జమ కావాల్సి ఉంటుంది.ఇందులో జమయ్యే నిధుల్లో ప్రధాన వాటా ఆస్తి పన్నులదే.ఏటా ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఏడాది కాలవ్యవధిలో ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపుదారుల కోసం పురపాలక శాఖ ఎర్లీ బర్డ్ పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది.ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్థిక సంవత్సరానిగాను ముందస్తు పన్ను చెల్లించే వారికి ఆస్తిపన్నులో ఐదు శాతం రాయితీ ఇస్తుంది.
ఈనెల 30 లోపు చెల్లించే వారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది.ఈ పథకంపై మున్సిపాలిటీ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు
.