జగదీష్ రెడ్డి మంత్రా లేక ఆ శాఖలో బంట్రోతా?: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

నల్లగొండ జిల్లా: ఒకవైపు రైతులకు 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నామని జగదీశ్‌ రెడ్డి చెబుతుంటే…మరోవైపు సీఎండీ ప్రభాకర్‌ రావు 24 గంటలు సింగిల్‌ ఫేజ్‌ మాత్రమే ఇస్తున్నామని అంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తెలిపారు.తన శాఖలో ఏం జరుగుతుందో జగదీష్ రెడ్డికి తెలియకపోతే ఎలా అని ప్రశ్నించారు.

 Tpcc Chief Revanth Reddy Comments On Minister Jagadish Reddy, Tpcc Chief Revanth-TeluguStop.com

జగదీశ్‌ రెడ్డిని మంత్రివా? లేక ఆ శాఖలో పని చేసే బంట్రోతువా అంటూ రేవంత్‌ రెడ్డి దుయ్యబట్టారు.అసలు ఎప్పుడైనా ఉచిత విద్యుత్‌పై సమీక్ష చేశారా అంటూ మండిపడ్డారు.

ఆర్టీజన్లను రెగ్యులరైజ్‌ చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి,ఇప్పుడు వారిని మోసం చేశారని ఆరోపించారు.కాంగ్రెస్‌ హయాంలో ప్రతి నెల 1వ తేదీనే విద్యుత్‌ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడేవని రేవంత్‌ రెడ్డి గుర్తు చేశారు.

అలాంటిది బీఆర్‌ఎస్‌ పాలనలో 20వ తేదీ వచ్చినా ఇంకా వారి ఖాతాల్లో జీతాలు పడటం లేదని ఆరోపించారు.ఇంతలా జీతాలు ఇవ్వలేని స్థితికి విద్యుత్‌ శాఖ దిగజారిందని ధ్వజమెత్తారు.

ఇప్పటికైనా విద్యుత్‌ ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు ఇవ్వాలని కోరారు.ఇందుకు సిగ్గుతో జగదీష్ రెడ్డి తలవంచుకొని మంత్రి పదవికి రాజీనామా చేయాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

వెంటనే రాజీనామా చేసి విద్యుత్‌ ఉద్యోగులకు, తెలంగాణ రైతులకు క్షమాపణలు చెప్పాలని సూచించారు.రాష్ట్రంలో చేతకాని, సోయిలేని మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగదీష్ రెడ్డి మాత్రమేనని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube