నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 18 వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములు,మెరుపులు, గంటకు 30 కి.మీ నుంచి 40 కి.
మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఉపరితల ద్రోణి పశ్చిమ విదర్భ నుంచి మరాఠ్వాడా మీదుగా ఉత్తర కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.దీనితో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వాతావరణంలో మార్పులు జరిగే అవకాశం ఉంది.నల్లగొండ జిల్లా ఉష్ణోగ్రతలు:నేడు గరిష్టంగా 41 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది.ఉదయం 5.57 గంటలకు సూర్యోదయం అవ్వగా సాయంత్రం 6.30 గంటలకు సూర్యాస్తమయం కానుంది.సూర్యాపేట జిల్లా ఉష్ణోగ్రతలు:నేడు గరిష్టంగా 41 డిగ్రీలు,కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది.ఉదయం 5.55 గంటలకు సూర్యోదయం అవ్వగా సాయంత్రం 6.28 గంటలకు సూర్యాస్తమయం కానుంది.యాదాద్రి భువనగిరి జిల్లా ఉష్ణోగ్రతలు:నేడు గరిష్టంగా 40 డిగ్రీలు,కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది.ఉదయం 5.57 గంటలకు సూర్యోదయం అవ్వగా సాయంత్రం 6.30 గంటలకు సూర్యాస్తమయం కానుంది.