యాదాద్రి జిల్లా:యాదగిరిగుట్టపైకి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులోని యాదవ్ నగర్ వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.పాత ఘాట్ రోడ్డుకు అనుబంధంగా నూతనంగా నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జీపై నుండి జేఎస్ఆర్ కాంట్రాక్టర్స్ కి చెందిన టిప్పర్ లారీ బ్రేక్ ఫైల్ కావడంతో క్రింద పడింది.
టిప్పర్ లారీ డ్రైవర్ రహీం(45)కి తీవ్ర గాయాలయ్యాయి.సంఘటన స్థలం వద్ద ఉన్నటువంటి స్థానికులు అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉంటే ప్రమాదానికి అసలు కారణం బ్రేకులు ఫెయిల్ కావడం కాదని,నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఎటువంటి ప్రమాద సూచికలు లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని,ఈ విషయం పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.