రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ దాడి

నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్లిన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు.తమ ఊరికి ఎందుకు వచ్చావంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతూ రాళ్లతో దాడికి దిగారు.

 Trs Attack On Rajagopal Reddy-TeluguStop.com

దీనితో భారీగా ఎత్తున మోహరించిన పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు.అనంతరం సరంపేటలో పోలింగ్ స్టేషన్ కు వెళ్లగా అక్కడ కూడా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు.

కార్యకర్తలకు పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో డీఎస్పీ మురికి కాలువలో పడిపోయారు.పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపడుతుండడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు.

ఒకవైపు టీఆర్ఎస్ కార్యకర్తలు,మరొకవైపు పోలీసులు బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడుతున్నారని రాజగోపాల్ రెడ్డి పోలీసుల తీరు పట్ల ఫైరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో మునిపెన్నడు జరిగిన విధంగా కనివినీ ఎరుగని రీతిలో ఒక యుద్ధ వాతవరణంలో జరిగిందన్నారు.

ప్రజలు చాలా ఆసక్తిగా గమనించారని,తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు కాబట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు.ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడ చెబుతామనే ఉద్దేశ్యంతోటి మేము ఎక్కడ ప్రచారం చేసినా అడ్డుకోవడం జరిగిందన్నారు.

అయినా సరే బీజేపీ కార్యకర్తలు మేమంతా చాలా కష్టపడ్డామన్నారు.కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు.

ఉద్యమకారులు,శ్రేయోభిలాషులు,స్నేహితులు,ఉద్యోగస్తులు,ఉపాధ్యాయులు చాలామంది నా గెలుపు కోసం సపోర్ట్ చేశారని అన్నారు.నాయకులు,కార్యకర్తలు,అభిమానులు యువకులకు ధన్యవాదాలు తెలిపారు.

ఏరోజైతే అమిత్ షా ను కలిశానో ఆరోజు ముఖ్యమంత్రి అలర్ట్ అయ్యాడని,ఆరోజు నుండి ఈరోజు వరకు పోలీసు యంత్రంగాన్ని ప్రయోగించి ఇబ్బందులు పెట్టాడని ఆరోపించారు.అధికార యంత్రంగం మునుగోడులో దొడ్డి దారిన గెలవాలని సకల ప్రయత్నాలు చేశారని,మీరంతా చూశారని,స్టీరింగ్ కమిటీ సభ్యులు,బిజెపి నాయకులు,కార్యకర్తలు చాలా కష్టపడ్డారని అన్నారు.

ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి కొత్త డ్రామాకు కేసీఆర్ తెరలేపాడని,నలుగురు ఎమ్మెల్యేలు బిజెపి కొనుగోలు చేస్తుందని కొత్త డ్రామా ఆడాడుని ఎద్దేవా చేశారు.అమ్ముడుపోయే చరిత్ర ఉన్నోళ్లు అవినీతి చేసేవాళ్లను బిజెపి పార్టీ ఎప్పుడు తీసుకోదని చెప్పారు.

నా మెజారిటీ తగ్గించలేస్తదేమో గానీ,నా గెలుపును మాత్రం ఆపలేడని తేల్చిచెప్పారు.పోలీసులంతా కూడా ఏకపక్షంగా టిఆర్ఎస్ కి అనుకూలంగా వ్యవహరించారని,ప్రతి ఒక్కరిని,ఆఫీసర్లతో సహా కిందిస్థాయి సిబ్బంది వరకు డబ్బులతో కేసీఆర్ కొనేశాడని,అది చూసి ప్రజలు కేసీఆర్ ను అసహ్యించుకుంటున్నారని అన్నారు.

మెజారిటీ తగ్గిన సరే మునుగోడులో నన్ను ప్రజలు గెలిపిస్తున్నరని ధీమా వ్యక్తం చేశారు.నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలన్నారు.

ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని పార్టీ మారిన,ఈ ప్రాంత అభివృద్ధి కోసమే రాజీనామా చేసిన,ఆరవ తారీకు వరకు కార్యకర్తలంతా ధైర్యంగా ఉండండన్నారు.టిఆర్ఎస్ దాడులను తిప్పికొడదామని,రాజగోపాల్ రెడ్డికి కష్టపడుతున్నాడంటే చాలామందిని అరెస్టు చేసి బెదిరిస్తున్నారని ఇదెక్కడి రాజకీయమని అసహనం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube