బీజేపీ,కాంగ్రేస్ నేతలకు గుత్తా వార్నింగ్

నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ లోని విజయ్ విహార్ లో శుక్రవారం తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు.

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని అనేక అద్భుతమైన సంక్షేమ పథకాలను మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి,దేశంలోనే అన్ని రాష్ట్రలకు ఆదర్శంగా నిలిచిందని,కానీ,బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ ని తిట్టడం,రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.రెండు జాతీయ పార్టీల నాయకులు అసత్యాలను ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చే పని చేస్తున్నారని దుయ్యబట్టారు.

గత ఎనిమిది సంవత్సరాలుగా దేశం తిరోగమనంలో ప్రయాణిస్తున్నది.దీనికి కేంద్ర ప్రభుత్వ పాలననే ప్రధాన కారణమని,బంగ్లాదేశ్ కన్నా మన దేశ జిడిపి శాతం తక్కువగా ఉందని,ఆహార సమస్యతో,ఆర్ధిక ఇబ్బందులతో ఉన్న దేశాల జాబితాలోకి మన దేశం చేరిందని వివరించారు.

గత ఎనిమిది సంవత్సరాల్లో పెట్రోల్,డీజిల్,నిత్యవసర సరుకుల ధరలు అధికంగా పెరిగాయని,ధరలను కంట్రోల్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని విమర్శించారు.దేశానికి కావాల్సింది డబుల్ ఇంజన్ సర్కార్ కాదని,ధరలను కంట్రోల్ చేసే సర్కార్ కావాలని,మత సామరస్యాన్ని కాపాడే సర్కార్ కావాలని చెప్పారు.

Advertisement

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ట్రబుల్ ఇంజన్ ప్రభుత్వాలుగా మారాయని ఎద్దేవా చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు టిఆర్ఎస్ పార్టీకి ఎటిఎంగా మారిందని టి బీజేపీ నేతలు అనడం సిగ్గుచేటని,వాళ్ల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టని ప్రశంసించారని గుర్తు చేశారు.

ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా మారిందని, రాహుల్ గాంధీని రాష్టానికి తీసుకువచ్చి రైతు సంఘర్షణ సభ అని పెట్టారు.అసలు ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియదని వ్యాఖ్యానించారు.

కాంగెస్,బిజెపి పాలిత ప్రాంతాల్లో రైతుబంధు,రైతు భీమా,24 గంటల ఉచిత కరెంట్ పథకాలు అమలు చేసి,ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు.అది మన ఒక్క రాష్టానికే సాధ్యమని స్పష్టం చేశారు.

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం పైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని,కొత్తగా ఇల్లు కట్టుకుంటేనే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురైతాయని,అలాంటిది అంత పెద్ద ఆలయ నిర్మాణం జరిగినప్పుడు చిన్న సమస్యలు ఎదురవుతాయని,తెలంగాణ సర్కారుకి యాదాద్రి ఆలయ అభివృద్ధి పైన ప్రత్యేక శ్రద్ధ ఉందని,అన్ని సమస్యలు త్వరగా పరిష్కరం అవుతాయని తెలిపారు.నల్గొండ జిల్లాకు చెందిన ప్రతిపక్ష నేతలు నేల విడిచి సాము చేస్తున్నారని,వారే అధికారంలోకి వస్తున్నట్లు భ్రమలో ఉండి మాట్లాడుతున్నారని, రెండు జాతీయ పార్టీల అధ్యక్షులకు గట్టిగా చెబుతున్నాం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే వారికి మంచిదని వార్నింగ్ ఇచ్చారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
కాబోయే కొత్తజంటలకు లగ్గాల బ్రేక్...మూడు నెలలు ముహూర్తాలు లేనట్లే...!

తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేయమంటే పారిపోయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,ఇవ్వాళ నీతులు మాట్లాడితే విడ్డురంగా ఉందని దెప్పి పొడిచారు.రాష్టానికి చెందిన బిజెపి,కాంగ్రెస్ నేతలు కేంద్రం నుండి మనకు రావాల్సిన నిధులు,నియామకాల కోసం మాట్లాడాలని సూచించారు.

Advertisement

Latest Nalgonda News