యాదాద్రి పవర్ ప్లాంట్లో భారీ చోరీని ఛేదించిన పోలీసులు: ఎస్పీ చందన దీప్తి

నల్లగొండ జిల్లా: దామరచర్ల మండలంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్ లో నిర్మాణ అవసరాల కోసం డంప్ చేసిన సుమారు రూ.1కోటి 49 లక్షల విలువ చేసే జిఐ మరియు అల్యూమినియం భారీ చోరికి గురైన నేపథ్యంలో బీహెచ్ఈఎల్ మరియు నిర్మాణ సంస్థలు వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాయి.మూడు కేసులు నమోదు చేసిన వాడపల్లి పోలీసులు జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆదేశాల ప్రకారం రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టి కేసును ఛేదించారు.కేసు వివరాలను శుక్రవారం ఎస్పీ చందనా దీప్తి మీడియాకు వెల్లడించారు.ఈ దోపిడికి పాల్పడిన దొంగల వద్ద నుండి రూ.71 లక్ష విలువచేసే నాలుగు జిఐ బండిల్స్,రూ.58 లక్షల నగదు,రూ.20 లక్షల విలువ గల ఒక బెలినో కారు,రెండు మోటార్ బైకులు,ఒక ఆటో మొత్తం రూ.1 కోటి 49 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు.

 Police Busted A Massive Theft At Yadadri Power Plant Sp Chandana Deepti, Police-TeluguStop.com

మిర్యాలగూడ చెందిన మహమ్మద్,మునీర్,అశోక్,మహేష్,జానీ మరియు రజాక్ లు ఒక ముఠాగా ఏర్పడి,దామరచర్లకు చెందిన ఆఫ్రోజ్, నాగేంద్రబాబు,శ్రీనులతో కలిసి వై.టి.పి.ఎస్ సంస్థలో సెక్యూరిటీ గార్డులు రవి,రాంబాబు, యాకూబ్,యూపీకి చెందిన సూపర్వైజర్ రంజిత్,క్రేన్ ఆపరేటర్ రవీందర్ ల సహకారంతో ఈ చోరికి పాల్పడ్డారని తెలిపారు.ఈ నేరంలో భాగస్తులైన సెక్యూరిటీ గార్డులు విధులలో ఉన్న సమయంలో వై.టి.పి.ఎస్ ఆవరణలోకి డీసీఎం వాహనము పంపి,క్రేన్ ఆపరేటర్ సహాయంతో పరికరాలను దొంగిలించి వాటిని హైదరాబాదు లోని ముషీరాబాద్ కు చెందిన షర్ఫోద్దీన్ కు విక్రయించి సొమ్ము చేసుకుని పంచుకున్నారన్నారు.

ఈ కేసులలో విచారణ ఇంకా కొనసాగుతున్నందున నిందితులను కోర్టులో హాజరు పరిచి పోలీస్ కస్టడీ ద్వారా తదుపరి విచారణ చేపడతామని, ఇంకా ఎవరెవరు నిందితులు భాగస్వాములుగా ఉన్నారో విచారణ చేయాల్సి ఉందన్నారు.

కేసును ఛేదించిన మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు, మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు,ఎస్ఐలు రవి, విజయ్ కుమార్,శోభన్ బాబు మరియు వాడపల్లి పోలీస్ సిబ్బంది,సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణు లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube