నల్లగొండ జిల్లా: కోమటిరెడ్డి బ్రదర్స్ మద్య వైరం పెరిగిందా? తమ్ముడు రాజ్ గోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో రీ ఎంట్రీ అయినప్పటి నుంచి అన్న వెంకట్ రెడ్డి అలక పానుపెక్కారా? తనకు తెలియకుండా హైకమాండ్ పెద్దలలో టచ్ లోకి వెళ్ళడమే వెంకట్ రెడ్డి అలకకు కారణమైందా? ఆర్ధిక లావాదేవీల విషయంలోనూ అన్నదమ్ముళ్ళ మద్య వివాదం ముదురుతోందా? ఎవరికి వారే యుమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్న వారి వైఖరి చూస్తుంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఫైర్ బ్రాండ్ అనే పేరుంది.
ఇప్పుడు వీరిద్దరి మద్య వార్ తారా స్థాయికి చేరినట్టే కనిపిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.నల్గొండ, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి,మిర్యాలగూడ సెగ్మెంట్ లలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని హై కమాండ్ వద్ద శపథం చేసి వచ్చారు రాజ్ గోపాల్ రెడ్డి.
సీన్ కట్ చేస్తే రాజ్ గోపాల్ రెడ్డి గెలుపు మునుగోడులోనే అతి కష్టంగా మారిందనే టాక్ నడుస్తుంది.సోదరుడు వెంకట్ రెడ్డి దూరమవ్వడం,ఆర్ధిక బరువులు మీద పడడం తో కేడర్ కూడా జంప్ అయ్యే పరిస్థితికి వచ్చిందని వార్తలు వస్తున్నాయి.
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్నదమ్ముల్లు అంటీ ముట్టనట్లు వ్యవహరించడం కేడర్ ను అయోమయానికి గురిచేస్తుంది.
కాగా ఈ వైరానికి పెద్ద కారణమే ఉందట.
తుంగతుర్తి, నకిరేకల్,మిర్యాలగూడ అభ్యర్ధులను తన గ్రిప్ లో పెట్టుకున్నారట రాజ్ గోపాల్ రెడ్డి. ఆ మేరకు వీరికి పెట్టుబడి సాయం అందజేస్తున్నారని సమాచారం.
ఈ అభ్యర్దులు గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తన బలంతో మంత్రి పదవి కొట్టేయాలనే ప్లాన్ తో ఉన్నారట రాజ్ గోపాల్ రెడ్డి.ఒకవేళ ఇదే జరిగితే వెంకట్ రెడ్డి ఆధిపత్యానికి బ్రేక్ పడొచ్చు.
దాంతో తమ్ముడు రాజ్ గోపాల్ రెడ్డి వ్యూహం పసిగట్టిన వెంకట్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారట.ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో బ్రదర్స్ వార్ చర్చకు,రచ్చకూ తెరలేపింది.
ఇందులో దాగి ఉన్న నిజానిజాలు ఏమిటో కానీ,ఇప్పుడు వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.