బీసీ కుల గణనకు జై కొట్టినందుకే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు...!

నల్లగొండ జిల్లా:బీసీ కుల గణనకు జై అన్నందుకే కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్ గౌడ్( Chintapalli Srinivas Goud ) అన్నారు.కర్ణాటక ఎన్నికల( Karnataka Elections ) ఫలితాలపై బీసీ సంక్షేమ సంఘం దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా బీసీ కుల గణన చేపడతామని ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేసి జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచుతామని,కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని రాయపూర్ కాంగ్రెస్ ప్లీనరీలో హామీ ఇచ్చినందుకే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిందని అన్నారు.

 Congress Win In Karnataka Because Of Bc Caste Enumeration , Karnataka Elections-TeluguStop.com

బీసీనని చెప్పుకుంటూ నరేంద్ర మోడీ</em( Narendra Modi ) గత తొమ్మిదేళ్ళ కాలంలో బీసీలకు ఏమి చేయకపోవడం,బీసీ కుల గణన చేసేదే లేదని స్పష్టం చేయడం,కనీసం బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడం,జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచకపోవడం,రాజ్యాంగ వ్యతిరేకంగా అగ్రవర్ణాలకు రిజర్వేషన్ కల్పించినందుకు కర్ణాటకలో బీజేపీ ఘోర పరాజయం పొందిందని అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షకార్యదర్శులు లింగంపల్లి మధు,వాల్దాస్ రవి గౌడ్,బీసీ సంక్షేమ సంఘం డివిజన్ నాయకులు చొల్లేటి భాస్కరాచారి మరియు బీసీ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube