ఏపీలోని టీడీపీ, వైసీపీ పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతునాయి.ఇప్పటికే ఇరు పార్టీల అధినేతలు అస్త్రశాస్త్రాలు సిద్దం చేసుకుంటూ పోలిటికల్ హీట్ పెంచుతున్నారు.
వైసీపీని( YCP ) ఎలాగైనా గద్దె దించేందుకు టీడీపీ ( TDP ) ప్రయత్నిస్తుంటే.టీడీపీకి అధికారం దక్కకుండా వైసీపీ ప్రయత్నిస్తోంది.
ఇలా ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు అమలు చేస్తున్న వ్యూహాలు అన్నీ ఇన్ని కావు.అందులో భాగంగానే రెండు పార్టీల అధినేతలు ఒకే వ్యూహాన్ని అమలు చేస్తూ ప్రజలను కన్ఫ్యూజన్ లో పడేస్తున్నారు.
అధికారమే లక్ష్యంగా ఉన్న చంద్రబాబు.( Chandrababu Naidu ) జగన్ పాలనపై ఘాటైన విమర్శలు చేస్తూ.సైకో పాలన అని, దుర్మార్గపు పాలన అని ఇలా రకరకాలుగా సిఎం జగన్ పై( CM Jagan ) విరుచుకుపడుతున్నారు.ప్రస్తుతం రాష్ట్రం పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లైందని, వచ్చే ఎన్నికలు సైకో వర్సస్ విజనరీ గా సాగుతాయని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు.
ఇదే విధంగా సిఎం జగన్ కూడా సమయం దొరికిన ప్రతిసారి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉంటారు.చంద్రబాబు హయంలో దోచుకో, దాచుకో, తినుకో అన్న పంథాలో ఆయన పాలన సాగిందని,

ఈసారి ఎన్నికలు పెత్తందారులకు పేదల ప్రభుత్వానికి మద్య జరుగుతాయని జగన్ చెబుతున్నారు.అయితే అధినేతలు ఇద్దరు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తే ప్రజలపై సెంటిమెంట్ అస్త్రాలను ప్రయోగిస్తున్నట్లు రాజకీయ వాదులు చెబుతున్నారు.ప్రస్తుతం జగన్ సైకో పాలన సాగిస్తున్నారని, రాష్ట్రంలో అభివృద్ది జరగాలంటే బాబు రావాలి పాలన మారాలి అనే రీతిలో సైకో వర్సస్ విజనరీ నినాదాన్ని హైలెట్ చేస్తోంది టీడీపీ.అటు జగనేమో బాబు వస్తే పెత్తందారీ పాలన జరుగుతుందని సామాన్యుడికి స్వేచ్చ ఉండదని,

చంద్రబాబు పాలనను పెత్తందారీ వ్యవస్థతో పోల్చుతూ పెత్తందారీ వ్యవస్థ వర్సస్ పేదల ప్రభుత్వం అనే నినాదిస్తున్నారు.దీంతో అటు చంద్రబాబుగాని ఇటు జగన్ గాని రెండు పార్టీల మద్య పోరును ప్రజా పోరుగా చిత్రీకరిస్తున్నారనేది కొందరి రాజకీయ వాదుల విశ్లేషణ.అయితే సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం ప్రజాభిప్రాయం ఎప్పుడు పారదర్శికంగానే ఉంటుందనేది కొందరి మాట.రాజకీయ నాయకులు ఎంత సెంటిమెంట్ రాజేసిన.తాము ఎన్నుకోబోయే నాయకుడి విషయంలో ప్రజాభిప్రాయం మారదనేది అందరికీ తెలిసిందే.







