నల్లగొండ జిల్లా: తెలంగాణ గ్రూప్-3 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది.ఈ నెల 17,18 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు.ఈ నెల 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరగనుంది.
అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు.18న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3 పరీక్ష ఉండనుంది.ఈ పోస్టులకు 5.36 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు.







