రాష్ట్రంలో టీఆర్ఎస్ పనైపోయింది

నల్లగొండ జిల్లా:మునుగోడు ఉప ఎన్నికపై రోజురోజుకి సర్వే రిపోర్టులు బీజేపీకి అనుకూలంగా వస్తుండడంతో కేసీఆర్ కు నిద్రపట్టక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.మునుగోడు మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని కేసీఆర్ కి అర్థమైందన్నారు.

 Trs Has Failed In The State-TeluguStop.com

ఎన్ని సర్వేలు చేసినా,ఎంత పోల్ మేనేజ్మెంట్ చేసినా బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తంచేశారు.రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్దరణ జరగాలంటే రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని మునుగోడు సమాజం చూస్తుందన్నారు.

టీఆర్ఎస్ ను బొంద పెట్టడానికి,కేసీఆర్ ని గద్దె దించడానికే ఈ ఉప ఎన్నిక వచ్చిందన్నారు.మన భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక ఇదని,ఇది మునుగోడుతోనే ఆగిపోదన్నారు.

కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని,నవంబర్ మూడో తారీఖున జరిగే ధర్మయుద్ధంలో పాల్గొనాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తున్నానని తెలిపారు.నా రాజీనామా వల్లనే గొల్లకుర్మ సోదరులకు డైరెక్ట్ గా అకౌంట్లలో డబ్బులు వేశారని,కానీ,పేరు రాజగోపాల్ రెడ్డికి వస్తుందని అకౌంట్లను సీజ్ చేయించాడని ఆరోపించారు.

ఈ స్కీంతో బీజేపీకి,కేంద్ర ప్రభ్యత్వానికి సంబంధం లేదన్నారు.కానీ,కావాలని దిష్టిబొమ్మలు దగ్ధం చేశారని,ఇది దుర్మార్గమైన చర్యని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క మునుగోడులో తప్ప ఎక్కడా గొర్ల స్కీం రావట్లేదని,కావాలనే ఓట్ల కోసం బీజేపీ ఫ్రీజ్ చేయించ్చిందని అబద్దపు ప్రచారం చేస్తున్నారన్నారు.అధికారాన్ని అడ్డం పెట్టుకుని 8 ఏళ్ళలో లక్షల రుపాయలు దోపిడీ చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

పదవి త్యాగం చేసిన నన్ను ఓడించాడనికి 100 మంది ఎమ్మెల్యేలను పెట్టి డబ్బులు గుమ్మరించి నాయకులని కొంటున్నావని,ఒక్క వ్యక్తిని ఓడించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికార యంత్రాంగం వాడుకుంటున్నావన్న సంగతి ప్రజలు గ్రహిస్తున్నారన్నారు.అనవసరంగా మీరు దుస్సాహాసం చేస్తున్నారని,ప్రలోభాలతో చేసే రాజకీయాన్ని ఎవరు నమ్మరని హితవుపలికారు.

ఓ పార్టీ అభ్యర్థికి ఎన్నికల కమిషన్ ఇచ్చిన రోడ్డు రోలర్ గుర్తును మార్పించారన్నారు.సీఎం కేసీఆర్ చెప్పే మాటలను ప్రజలు అసహ్యయించుకుంటూ ఉన్నారన్నారు.

మీ వెంట ఉండే టీఆర్ఎస్ నాయకులు ఎవరు ప్రేమతో లేరన్నారు.ఏ రోజైతే రెవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యాడో ఆ రోజే కాంగ్రెస్ పని అయిపోయిందని విమర్శించారు.

అప్పుల తెలంగాణను గాడిలో పెట్టాలంటే బీజేపీకే సాధ్యమన్నారు.మేము కుటిల రాజకీయాలు చేస్తున్నామని కేటీఆర్ మాట్లాడుతున్నాడు,ఈ మూడు నెలల్లో డబ్బులు ఇవ్వకుండా ఈ మునుగోడులో ఎవరైనా టీఆర్ఎస్ లో చేరారా అని ప్రశ్నించారు.

మీ అవినీతి సొమ్ము పెట్టి నాయకులను కొన్నా ప్రజలు మాత్రం మా వైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.మేము ఎన్నికల ప్రచారం చేస్తుంటే వచ్చి అడ్డుకుంటున్నారని,మీరు ప్రజలకు ఏం చేశారో ప్రచారం చేసుకోండి.

అంతే కానీ,మేము ప్రచారం చేస్తుంటే అడ్డుకోవడం సరికాదన్నారు.బీజేపీ ఓటేస్తే పింఛన్ రాదు,రైతు బంధు రాదని టీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామాలలో ప్రజలను బెదిరిస్తున్నారని,హుజురాబాద్ లో ఇలాగే బెదిరించారని,ఇపుడు అక్కడ పింఛన్లు వస్తున్నాయని,రేపు బీజేపీ అధికారంలోకి వస్తే రూ.3000 పింఛన్ ఇస్తామన్నారు.మునుగోడు హైదరాబాద్ కు ఆమడ దూరంలో ఉన్నా అభివృద్ధికి నోచుకోలేదని,చౌటుప్పల్ లో మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదని,ఎవ్వరు కూడా మునుగోడు నియోజకవర్గంలో మిషన్ భగేరద నీళ్లు తాగడం లేదన్నారు.

నియోజకవర్గంలో సాగు నీటి ప్రాజెక్ట్ లన్ని ఆగిపోయాయి నియోజకవర్గం అభివృద్ధి కోసం కేంద్రం మాట ఇచ్చింది,రాబోయే రోజుల్లో దాదాపు వేయి కోట్లతో అన్ని రకాలుగా అబివుద్ది చేసే బాధ్యత నాదని హామీ ఇచ్చారు.పోలీసుల బెదిరింపులు,ప్రసంగాల అడ్డగింత అన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారని,కార్యకర్తలు ఎవ్వరు కూడా బయపడకండి,మునుగోడులో తీర్పు తరువాత రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పులు ఉంటాయని జోస్యం చెప్పారు.

ఈటెల రాజేందర్ పోటీ చేసేటప్పటి నుండే ధర్మానికి అధర్మానికి యుద్ధం మొదలైందని అన్నారు.కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ధర్మం వైపు నిలబడాలని ఈటెల రాజందర్ కి మద్దతు ఇచ్చినారని,ఇపుడు ఉన్న ప్రత్యేక పరిసతుల్లో మా సోదరుడితో పాటు చాలా మంది కమ్యూనిస్ట్ నాయకులు ఇతర పెద్ద నాయకులు కూడా నాకు ఓటెయ్యాలని చెబుతున్నారు,మా సోదరుడు వెంకట్ రెడ్డి తెలంగాణ కోసం పదవి త్యాగం చేసాడు.

కావాలని పదే పదే డిగ్రేడ్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు.కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందని,కాంగ్రెస్ పార్టీకి ఓటస్తే టీఆర్ఎస్ కు వేసినట్లే అన్నారు.

బీజేపీని ఓడించాలని కాంగ్రెస్,టీఆర్ఎస్ ఏకమయ్యారని ఆరోపించారు.ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత,రేవంత్ రెడ్డి పార్టనర్లన్నారు.

నిన్న రేవంత్ రెడ్డి ఏడుస్తుండని,ఏడ్చే మొగోన్ని నవ్వే ఆడదాన్ని నమ్మొద్దంటారనే సామెతని గుర్తు చేశారు.ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టొద్దని,ఎట్టి పరిస్థితుల్లో జరగబోయే ఎన్నికలో పువ్వు గుర్తుమీద ఓటేసి గెలిపించండని మీడియా ద్వారా ప్రజలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube