కలెక్టరేట్ ముందు కాంగ్రేస్ ధర్నా

యాదాద్రి భువనగిరి జిల్లా:పెంచిన పెట్రోల్,డీజిల్, గ్యాస్,విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బుధవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్,డీజిల్,వంటగ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలు,కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు.5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిన వెంటనే పెట్రోల్,డీజిల్,వంట గ్యాస్ ధరలు పెంచుతూ బీజేపీ ప్రభుత్వం తన వక్రబుద్ధిని ప్రదర్శించిందని మండిపడ్డారు.మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కరెంట్,బస్ ఛార్జీలు పెంచుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు.

 Congress Dharna In Front Of The Collectorate-TeluguStop.com

టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు బకాయిలు చెల్లించే నెపంతో విద్యుత్ ఛార్జీలు పెంచతూ సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మోపడం సమంజసం కాదని అన్నారు.రైతుల నుండి వడ్లు కొనుగోలు చేయకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నిందలు మోపుతూ ధర్నాలు చేయడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.

వడ్లు ఐకేపీ,పీఏసీ సెంటర్లకు వస్తున్నాయని,ప్రభుత్వాలు వెంటనే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించకపోతే కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రేస్ నాయకులు,భువనగిరి పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube