పెళ్లికి ముందు సెక్స్,శృంగారం,సహజీవనంపై నిషేధం విధించాలి!

నల్లగొండ జిల్లా:సంప్రద్రయక పెళ్లి, కులాంతర,మతాంతర వివాహం, సహజీవనం మూడింటి దారులే వేరు,గమ్యం,లక్ష్యం ఒకటేనని, సహజీవనం పౌరుల హక్కు మాత్రమే కాదు,బాధ్యత కూడా!అంటూ, సహజీవన జంటలు కలిసి వుండడం, విడిపోవడం అనేది సొంత నిర్ణయాల మీద కాకుండా చట్ట పరిధిలోనే జరగాలని,అక్రమ (సెక్స్) శృంగారంలో పాల్గొనే కామ వ్యభిచార ముఠాలను కఠినంగా శిక్షించాలని,నూతన వివాహ చట్టానికి రూపకల్పన చేయాలని భారత ప్రధానమంత్రికి ప్రజానేస్తం,వామపక్ష, ప్రగతిశీల,ప్రజాతంత్ర సామాజిక ఉద్యమకారుడు,అభ్యుదయవాది జైబోరాన్నగారీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ బహిరంగ లేఖ రాశారు.సమాజంలో పెళ్ళి లేదా వివాహం ఇద్దరు స్త్రీ పురుష భాగస్వామ్యుల మధ్య హక్కులు, బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందమని వ్యాఖ్యానించారు.

 Sex, Love And Cohabitation Should Be Banned Before Marriage!-TeluguStop.com

వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుందని,కానీ,ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత,లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థగా అభివర్ణించారు.కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిఫార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందమని,విస్తారంగా వివరించుటకు వివాహం అనేది ఒక సాంస్కృతికంగా సార్వజనీనమైన మానవ సమాజ పురోగమన కార్యక్రమంగా పేర్కొన్నారు.

మన దేశంలో వివాహానికి ముందు శృంగారంలో (సెక్స్)లో పాల్గొనడం,సహజీవనం చేయడంపై నిషేధం విధిస్తూ నూతన చట్టాన్ని తేవడానికి భారత ప్రభుత్వం సిద్ధం కావాలని బహిరంగ లేఖలో విజ్ఞప్తి చేశారు.పెళ్లికి ముందు (సెక్స్) శృంగారంలో పాల్గొనడం,సహజీవనం చేయడంపై ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని ఉల్లంఘించినవారికి ఐదు సంవత్సరాల జైలుశిక్ష లేదా 25 లక్షల భారీ జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.21 సంవత్సరాలు నిండిన భారతీయ యువతీ,యువకులలందరూ పెళ్లికి ముందు (సెక్స్) శృంగారంలో పాల్గొనడం మంచిది కాదని పేర్కొన్నారు.పెళ్ళికి ముందు (సెక్స్) శృంగారంలో కానీ, సహజీవనంలో కానీ పాల్గొంటే అమ్మాయిల,స్త్రీల జీవితాలు చాలా దారుణంగా దెబ్బతింటున్నాయని, మగాడు మృగాడై మహిళల జీవితాలు కాటు వేస్తున్నాడని,అమాయకమైన బాలికలు గర్భం దాలుస్తున్నారని, ప్రాణాలు కోల్పోతున్నారని,సమాజంలో అవమానాలకు,అణిచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పెళ్లికి ముందు (సెక్స్) శృంగారంలో పాల్గొనడం వల్ల సహజీవనం చేయడం వల్ల మహిళలు మగ మృగాల చేత దారుణంగా వంచించబడుతున్నారని,ఒకడు పెళ్లి పేరుతో,మరోకడు ప్రేమ పేరుతో మహిళలను మోసం చేస్తున్నాడని,సెక్స్ మోజు తీరగానే మహిళలను లైంగికంగా వాడుకోని వదిలేస్తున్నారని వివరించారు.మహిళలను మగ మృగాల కామ కోర్కెల నుండి కాపాడాలంటే మనదేశంలో కఠినమైన చట్టాలు ఉండాలని సూచిచారు.

(సెక్స్)శృంగారంలో మదమెక్కిన మానవ మృగాలకు, తిరుగుబోతులకు,వ్యభిచారులకూ విధించబోయే కఠిన శిక్షలకు సంబంధించిన క్రిమినల్ కోడ్ ముసాయిదాను తక్షణమే రూపొందించి పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.పెళ్లికి ముదు (సెక్స్) శృంగారం చేయడం,సహజీవనం చేయడం పట్ల నిషేధం విధించడం దేశ ప్రగతికి ఎంతగానో దోహదపడుతుందని,స్త్రీ జాతి మాన,ప్రాణాలు రక్షించబడతాయని పేర్కొన్నారు.

సహజీవనాన్ని కూడా సాదారణ పెళ్లిగానే పరిగణించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ 21 సంవత్సరాలు నిండిన భారతీయ యువతీ,యువకులకు సహజీవనం చేసే హక్కు ఉన్నదని,కానీ,వారు విడిపోయే హక్కు మాత్రం సహజీవనం చేసే జంటలకు ఉండకూడదని,ఒకవేళ వారు విడిపోవాలనుకుంటే సాధారణ వివాహ నియమ నిబంధనలు ఎలా ఉంటాయో, ఈ సహజీవన వ్యక్తులకు కూడా అవే వర్తింపచేయాలని,వారు రాజ్యాంగ పరిధిలోని చట్టాలకు లోబడి వారు విడిపోయేటట్లు నిబంధనలు ఉండాలని పేర్కొన్నారు.దేశంలో సహజీవన జంటలు వారి సొంత నిర్ణయాలతో విడిపోకుండా, వారిని భారతీయ వివాహచట్టం పరిధిలోకి తేవాలని,21 సంవత్సరాలు నిండిన యువతీ,యువకులకు సహజీవనం చేసే హక్కు ఉందని అయితే విడిపోయే హక్కు వారి చేతిలో మాత్రం ఉండకూడదని,సహజీవనం పేరిట కాలక్షేపానికీ కామదాహం తీర్చుకునే వ్యభిచార జంటలను కఠినంగా శిక్షించాలని కోరారు.

అక్రమ సెక్స్ లైంగిక సంబంధాలను కొనసాగిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని,ఒక్కసారి సెక్స్ శృంగారంలో పాల్గొంటే వారిని భార్యాభర్తలుగా గుర్తిస్తూ చట్టాన్ని తీసుకురావాలని ప్రజాతంత్ర,ప్రగతిశీల మార్పును కాంక్షించే ప్రజా పరివర్తకుడు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న 9701487102 పేర్కొన్నారు.పెళ్లికి ముందు సెక్స్ శృంగారంలో పాల్గొనడం,సహజీవనంచేయడంపై నిషేధం విధించడం వల్ల సమాజంలో అనేక నేరాలు,ఘోరాలు తగ్గటానికి మార్గం ఏర్పడుతుందని,పెళ్లి అనేది యువతీ, యువకుల ఇష్టాలకూ అనుగుణంగా చేసుకోవచ్చని,కానీ,వారు విడిపోవడం చట్టపరిధికి లోబడి జరగాలని నూతన ప్రజాస్వామిక సమ సమాజ స్వప్నికుడు జై బొరాన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ లేఖలో పేర్కొన్నారు.

భార్య లేదా భర్త కాకుండా ఇతరులతో భార్య కానీ,భర్త కానీ,దేశ పౌరులు ఎవరైనా ఎంతటి,వారైనా అక్రమ సంబంధపు సెక్స్ శృంగారంలో పాల్గొంటే,అలాంటివారిని వ్యభిచారులుగా పరిగణించి గట్టిగా శిక్ష విధించాలని,ఇటువంటి వ్యభిచార ముఠాలను కఠినంగా శిక్షించుటకు, దేశంలో సమగ్ర వ్యభిచార నిర్మూలన చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.మన దేశ పౌరులతో పాటు విహారయాత్రలకు వచ్చే విదేశీయులకూ వివాహ వ్యవస్థకు సంబంధించిన నియమ,నిబంధనలు రూపొందించి,అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

దేశంలో రోజురోజుకు దిగజారి పోతున్న కుటుంబ విలువలను కాపాడుటకు,బాల,బాలికల హక్కులను కాపాడుటకు,సమాజంలో చిన్న పిల్లలు గౌరవంగా జీవించడానికి,ఆరోగ్యంగా పెరగడానికి,పిల్లలు మంచిగా చదువుకోవడానికి,దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు,పవిత్రమైన భారతీయ విలువలను,సాంస్కృతిని, సాంప్రదాయాలనూ కాపాడుటకు మన దేశ విలువలకు తగ్గట్లుగా నూతన వివాహ చట్టాన్ని తీసుకురావాలని ప్రజాతంత్ర ఉద్యమ కార్యకర్త కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన బహిరంగ లేఖలో విజ్ఞప్తి చేశారు.దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న స్వలింగ సంపర్కులపై, వారియొక్క సెక్స్,లైంగిక సంబంధాల జీవన విధానంపై నిషేదం విధించాలని డిమాండ్ చేశారు.

ప్రకృతి యొక్క నియమ నిబంధనలను సమాజం గౌరవించాలని,మెరుగైన సమాజ నిర్మాణానికి ఆరోగ్యవంతమైన స్త్రీ+పురుష లైంగిక సంబంధాలు దోహదపడతాయని,స్వలింగ సంపర్కం అనేది సమాజ హితానికి,సమాజ పురోగతికి హాని చేస్తుందని,ఇందుకోసం దేశంలోని ప్రజలను చైతన్యవంతులను చేయాలని నేతాజీ సుభాషన్న 98485 40078 కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న నేరాలు-ఘోరాలకు సగం కారణం అనైతికమైన సెక్సువల్ రిలేషన్స్ అని పేర్కొన్నారు.

అక్రమ సబంధాల వల్ల సమాజ ఆర్థికాభివృద్ధికి నష్టం కలుగుతుందని,కుటుంబ జీవితాలు చిన్నభిన్నమవుతాయని,పిల్లలు అనాధలవుతారని,కార్మిక,కర్షక,ప్రజా నేస్తం కామ్రేడ్ మాన్య శ్రీ జైబోరాన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ లేఖలో పేర్కొన్నారు.పెళ్ళి తరువాత భార్యాభర్తలు కొన్ని అనివార్య కారణాల వలన విడిపోవాలని నిర్ణయించుకోవడాన్ని విడాకులుగా పిలుస్తారని,భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసే కుటుంబాలలో విడాకులు ఎక్కువగా జరుగుచున్నవని, పేర్కొన్నారు.

విడాకుల వల్ల విడిపోయిన కుటుంబాల్లోని పిల్లలపై దాని తీవ్ర ప్రభావం పడుతోందని,ఇటీవల కొన్ని వివాహాల సమయంలోనే ముందస్తు విడాకుల పిటిషన్లు దాఖలవుతుండటం బాధాకరమని సమాజాహితాన్ని కాంక్షించే సమసమాజ స్వాప్నికుడు కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.జీవితభాగస్వామికి ఎయిడ్స్, కుష్టు,మానసిక,శారీరక,లైంగిక అనారోగ్యం లాంటి వ్యాధులున్నాయనే కారణాలపై విడాకులు ఇవ్వవచ్చనని పేర్కొన్నారు.

విడాకులకు సంబంధించి దేశంలో వీటిని కొన్ని జంటలు దుర్వినియోగం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.పాత రోజుల్లో మన తాత,ముత్తాతలకు ఇలాంటి సమస్యలు లేవని,అప్పట్లో వివాహ వివాదాలు నాలుగు గోడల మధ్య ఇంట్లోనే పరిష్కారమయ్యేవని,పిల్లలకోసం,పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అహం వదులుకోవాలని కోరారు.

తల్లిదండ్రుల విడాకులవల్ల చివరకు బాధపడేది పిల్లలేనని,ఆడపిల్ల విషయంలోనైతే వారి చదువు,పెరుగుదల,వివాహం పరిస్థితి మరీ తీవ్రంగా బాధగా ఉంటుందని, సమాజంలో మంచి కుటుంబ నిర్మాణం ద్వారా మాత్రమే,కుటుంబ గౌరవాన్ని కాపాడటం ద్వారా మాత్రమే మంచి సమాజాన్ని,ఆదర్శవంతమైన అగ్రగామి దేశాన్ని నిర్మించగలుగుతామని ఆ దిశగా 21 సంవత్సరాలు నిండిన భారతీయ యువతీ,యువకులు సమాజ పురోగమనానికి దోహదపడే అభ్యుదయ ఆలోచనలకు మార్గం వేయాలని సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ, బాధితుల బంధువు కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ సమస్త ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు.మెరుగైన సమాజ నిర్మాణానికి దేశంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని,కులాంతర, మతాంతర,అభ్యుదయ వివాహాలను ప్రోత్సహించాలని,వరకట్న దురాచారాన్ని రూపుమాపాలని,స్త్రీలను గౌరవించే సాంస్కృతిని ఇంటి నుండే పిల్లలకు పెద్దలు నేర్పాలని పేర్కొన్నారు.

మతసామరస్యం కోసం,కుల నిర్మూల కోసం,సామాజిక పరివర్తన కోసం నూతన భారతదేశ నిర్మాణం కోసం ప్రజలు ప్రజాస్వామిక వాదులు మెరుగైన ఆచరణాత్మక ఆలోచనలు చేయాలని, ఇందుకోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి పెంచాలని,ప్రగశీల,ప్రజాస్వామిక సామాజిక ఉద్యమకారుడు, ప్రజా పరివర్తకుడు,జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న విజ్ఞప్తి చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube