నల్లగొండ జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.డీఎస్సీకి( DSC ) ముందే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది.11,062 ఉపాధ్యాయ నియామకానికి గానూ గత నెల 29వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే.
సాధ్యమైనంత త్వరగా టెట్( TS TET ) నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో సుమారు 3 లక్షల మంది అభ్యర్థులకు ఊరట లభించనుంది.







