నల్లగొండ జిల్లా:నకిరేకల్ మున్సిపాలిటీలో గత ఆరు నెలలుగా పాత బ్రిడ్జి పక్కన నిర్మిస్తున్న కొత్త బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నిబంధనలు పాటించని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.నిర్మాణ ప్రదేశంలోఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు,రేడియం స్టిక్కర్లు పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల గతంలో ఈ బ్రిడ్జిలో పడి మరణించాడని,అయినా అధికారులు పర్యవేక్షణ లేకపోవడం బాధాకరమని వాపోతున్నారు.
కోర్టుకు,పెట్రోల్ బంక్,రిజిస్టర్ ఆఫీసర్ వెళ్లడానికి ఇదే దారి కావడంతో ఇబ్బందిగా ఉందంటున్నారు.మరో ప్రమాదం జరగకముందే ఇప్పటికైనా అధికారులు స్పందించి కాంట్రాక్టర్ పై,ఆర్ అండ్ బి,మున్సిపాలిటీ అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.