నల్లగొండ జిల్లా: ఏ తప్పు చేయని మా నాన్నను నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కొట్టించాడని పదేళ్ల చిన్నారి జ్ఞాన ప్రసన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందూరు జైవీర్ రెడ్డికి ఫిర్యాదు చేస్తూ కన్నీరుమున్నీరుగా విలపించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం రామన్నగూడెం తండాలో ఎన్నికల ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కుందూరు జైవీర్ రెడ్డి దగ్గరకు వచ్చిన తన్నీరు జ్ఞానప్రసన్న (10) ఆయనకు ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది.
ఆ చిన్నారిని గమనించిన ఆయన పైకి తీసుకురావాలని కోరారు.ప్రచార రథం మీదికి ఎక్కిన చిన్నారి మాట్లడుతూ తన తండ్రి తన్నీరు సతీష్ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి, కేసీఆర్ మీద అభిమానంతో బీఆర్ఎస్ పార్టీలో చేరి,పార్టీ బలోపేతానికి కృషి చేశారని అన్నారు.
అలాంటి మానాన్నను ఎమ్మెల్యే నోముల భగత్ పోలీస్ స్టేషన్లో పెట్టించి అతి దారుణంగా కొట్టించాడని, అతను ఈ ఎన్నికల్లో ఓడిపోవాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కందూరు జైవీర్ రెడ్డికి విలపిస్తూ విన్నవించింది.నోముల భగత్ కు డిపాజిట్ దక్కకుండా ఓడించాలని ఓటర్లను ప్రార్థించింది.ఎలాగైనా మీరే గెలవాలంటూ జైవీర్ రెడ్డి ప్రచారం కోసం చిన్నారి రూ.5 వేలు విరాళంగా ఇచ్చింది.ఆ చిన్నారి నాగార్జున సాగర్ లోని ఐపీఎస్ స్కూల్లో 4వ తరగతి చదువుతుంది.జైవీర్ రెడ్డి మాట్లాడుతూ తండా ప్రజలు ఈసారి బీఆర్ఎస్ కు ఓటేస్తే రావణకాష్టగా మార్చేస్తుందని,సాగర్ అభివృద్ధికి స్థానికుడైన తాను నిరంతరం పాటు పడతానని,చిన్నారి కోరికను తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.