అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు

నల్లగొండ జిల్లా:అధికారం అడ్డంపెట్టుకొని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను ఏ రకంగా నిర్వీర్యం చేసిందో, అదే రకంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం టిఆర్ఎస్ మీద చేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్ జక్కలి ఐలయ్య యాదవ్ అన్నారు.గురువారం చండూరు మండలం కేంద్రంలో సభ్యత్వ నమోదు,సంస్థగత నిర్మాణంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అయన పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యవస్థలను ఉపయోగించుకొని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఇతర పార్టీలే ఉండకూడదనే దురుద్దేశ్యంతో ఏసీబీ,పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి టీడీపీతో పాటు ప్రతిపక్ష పార్టీల మీద కక్షసాధింపు చర్యలకు పాల్పడిందన్నారు.

 Governments That Are Blocking The Power And Weakening The Opposition-TeluguStop.com

టీఆర్ఎస్ ఏ విధంగా కుట్రపూరితంగా వ్యవహరించి కేసులు పెట్టి, భయపెట్టించి టిఆర్ఎస్ లో చేర్చుకుందో,అదే విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యవహరిస్తుందన్నారు.అందులో భాగంగానే మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులని, దాంట్లో కొత్తేమీ లేదన్నారు.

టిఆర్ఎస్ చూపిన దారిలోనే బీజేపీ పయనిస్తుందన్నారు.తెలుగుదేశం హయాంలో అధికార యంత్రంగం,రాజ్యాంగ బద్ధమైన సంస్థలు హుందాగా వ్యవహరించేవని గుర్తు చేశారు.

టీడీపీ రాష్ట్రంలో నీతివంతమైన సమర్థవంతమైన పరిపాలన అందించిందన్నారు.ఎన్టీఆర్,చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు గుర్తు చేస్తూ గ్రామాలలో సభ్యత నమోదు,సంస్థగత నిర్మాణం చేపట్టాలని కోరారు.

రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.పేద వర్గాలకు వేదిక టీడీపీ అని అన్నారు.

ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎర్రజల్ల లింగయ్య,ఎండి షరీఫ్,నాయకులు గంట అంజయ్య,వంగరి శ్రీను,తోకల యాదయ్య,బోడ బిక్షం, నందగిరి కృష్ణ,కావలి బిక్షం,జేమ్స్,మారగొని పాపయ్య, గంట సాయి,చొప్పరి వేమయ్య,కుట్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube