నల్లగొండ జిల్లా:మునుగోడు ప్రజల ఆదరణ చూస్తే ఉప ఎన్నికల్లో కాంగ్రేస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి లక్ష ఓట్ల మెజారిటీతో పట్టం కట్టబోతున్నట్లు స్పష్టమవుతుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు.డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ అధ్యక్షతన ఆదివారం మునుగోడులో నిర్వహించిన ప్రజాప్రతినిధుల సభకు ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ మునుగోడులో బీజేపీ,టిఆర్ఎస్ పార్టీలు ఓటర్లను,నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని,మునుగోడు ప్రజలు అన్నీ నిశితంగా గమనిస్తున్నారని,సరైన సమయంలో ఆ రెండు పార్టీలకు సరైన గుణపాఠం చెబుతారని అన్నారు.
మునుగోడులో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.