ఏ మాయ చెశావే సినిమాతో గౌతమ్ వాసుదేవ మీనన్ టాలీవుడ్ ప్రేక్షకుల మనస్సులను గెలుచుకున్నారు.నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ప్రస్తుతం గౌతమ్ వాసుదేవ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కిన లైఫ్ ఆఫ్ ముత్తు సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గౌతమ్ మీనన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఒకే రంగానికి చెందిన వ్యక్తులు పెళ్లి చేసుకోవచ్చా? పెళ్లి చేసుకోకూడదా? అనే ప్రశ్నకు గౌతమ్ మీనన్ స్పందిస్తూ ఆ అంశం గురించి మాట్లాడటానికి నాకు అధికారం లేదని అన్నారు.ఇద్దరు వ్యక్తులు కలవడానికి విడిపోవటానికి నిబంధనలు లేవని ఏదైనా రిలేషన్ లో ఉన్న సమయలో సమస్యలు తలెత్తితే ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇద్దరూ ప్రయత్నించాలని ఆయన కామెంట్లు చేశారు.

ఒకే రంగానికి చెందిన వాళ్లు రిలేషన్ షిప్ లో ఉండాలని లేదని అదే సమయంలో ఉండకూడదని కూడా లేదని గౌతమ్ మీనన్ చెప్పుకొచ్చారు.ఎందుకంటే రెండు మనసులు కలిస్తే చాలు అని ఆయన కామెంట్లు చేశారు. ఏ మాయ చేశావే స్క్రిప్ట్ రాసిన సమయంలో ఆ సినిమాలో మహేష్ బాబును హీరోగా అనుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.ఆ సమయానికి మహేష్ పోకిరి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారని ఆయన తెలిపారు.

ఏ మాయ చేశావె కథ సిద్ధమైన తర్వాత మహేష్ ను కలవగా తాను క్లాస్ సినిమా కాకుండా మాస్, యాక్షన్ సినిమా చేయాలని అనుకుంటున్నానని చెప్పారని గౌతమ్ మీనన్ అన్నారు.గౌతమ్ మీనన్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.మహేష్ గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా తెరకెక్కలేదు.రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది.







