నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి నిత్యం తిరుపతి వివిధ ప్రాంతాలకు వందలాది మంది ప్రయాణిస్తూ వుంటారు.ఈ నేపథ్యంలో ఈ స్టేషన్ నుండి వెళుతున్న వందే భారత్ రైలుకు మిర్యాలగూడలో స్టాప్ కల్పించాలని ఈ ప్రాంత వాసులు రైల్వే అధికారులకు చాలా సార్లు విన్నవించుకున్నారు.దీనికి రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి తిరుపతి వెళ్లే వందే భారత్ రైలును మిర్యాలగూడ రైల్వేస్టేషన్ లో ఉదయం 7:55 నిముషాలకు,రాత్రి 9.22 నిముషాలకు ఒక్క నిమిషం పాటు ఆపే విధంగా చర్యలు తీసుకున్నారు.వందేభారత్ రైలుకు స్టాప్ కలించినందుకు మిర్యాలగూడ ప్రాంతవాసులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.




Latest Nalgonda News