రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో సైతం గామి మూవీ( Gaami ) రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.
ఈ సినిమా రెండో రోజు 6 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.ఈ సినిమాలో విశ్వక్ సేన్, చాందిని చౌదరి తమ పాత్రలకు ప్రాణం పోశారు.
అద్భుతమైన నటన కనబరిచి ప్రేక్షకులను మెప్పించారు.

విశ్వక్ సేన్, చాందిని( Vishwak sen ) చౌదరిలను సరిగ్గా వాడుకుంటే కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ కావడంతో పాటు వీళ్లిద్దరి రేంజ్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.మల్టీప్లెక్స్ లలో ఈ సినిమాకు బుకింగ్స్ అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి.విశ్వక్ సేన్, చాందిని చౌదరిలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి ఎ సర్టిఫికెట్ వచ్చింది.

ఎ సర్టిఫికెట్ రాకుండా ఉండి ఉంటే ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగేవని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.గామి సినిమా యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.తక్కువ బడ్జెట్ తో ఈ స్థాయిలో అద్భుతమైన సినిమాను తీశారంటే మామూలు విషయం కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
రొటీన్ మాస్ మసాలా సినిమాల్లో నటించే హీరోలు ఈ సినిమాను చూసి ఎంతో నేర్చుకోవాలి.టాలీవుడ్ స్థాయిని ఎన్నో రెట్లు పెంచే సినిమాలలో గామి సినిమా ఒకటవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గామి సినిమా ఫస్ట్ వీకెండ్ సమయానికే చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఈ సినిమా ఒకటిగా నిలిచే ఛాన్స్ అయితే ఉంది.
గామి మూవీ నెక్స్ట్ లెవెల్ మూవీ అని మరి కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.







