నల్లగొండ జిల్లా: గుర్రంపోడ్ మండలం కోయిగురోనిబావి గ్రామానికి చెందిన ముస్కు కుమార్ ఆదివారం మధ్యాహ్నం భార్యతో గొడవపడి మద్యం మత్తులో ఇంటికి నిప్పు పెట్టడంతో తన ఇంటితో పాటు పక్కనున్న మరో ఆరు ఇళ్లకు మంటలు వ్యాపించి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.భారీ అగ్ని ప్రమాదం తలెత్తడంతో గ్రామస్తులు మంటలు ఆర్పీ ప్రమాద తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు.
వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.సమయానికి అగ్నిమాపక సిబ్బంది రావడంతో పెను ప్రమాదం తప్పింది.ఈ అగ్ని ప్రమాదంలో లక్షల్లో ఆస్థి నష్టం జరిగినట్లు బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపించారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై శివప్రసాద్ తెలిపారు.