నల్లగొండ జిల్లా:డిసెంబరు 1 నుంచి సిమ్ కార్డులకు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.దీనితో సిమ్ కార్డుల( SIM cards ) జారీ మరింత కట్టుదిట్టం చేస్తారని,సిమ్ కార్డు విక్రయదారులకు రిజిస్ట్రేషన్,పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేసే అవకాశం ఉందని సమాచారం.నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10 లక్షల వరకు పెనాల్టీ వేసేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తుంది.వినియోగదారులకు ఆధార్ స్కాన్,డెమోగ్రఫీ డేటా సేకరణ తప్పనిసరి చేయాలని భావిస్తున్నారు.







