రాజగోపాల్ రెడ్డి రాజీనామా

నల్లగొండ జిల్లా:మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల రెడ్డి రాజీనామాపై వస్తున్న ఊహాగానాలకు ఆయన మంగళవారం సాయంత్రం చెక్ పెట్టారు.కాంగ్రేస్ పార్టీకి,తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు.

 Rajagopal Reddy's Resignation-TeluguStop.com

తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలోనే తనను టీఆర్​ఎస్​ లోకి రావాలని పిలిచారని,వ్యక్తిత్వాన్ని అమ్ముకోనని,ఇక ముందుకు కూడా చేయనని రాజగోపాల్​ రెడ్డి అన్నారు.అందుకే ఎమ్మెల్యే పదవికి,కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.

నియోజకవర్గంలో అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.మునుగోడులో ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారని,డబ్బు సంచులతో వచ్చి గెలుస్తారా అని అన్నారు.

కోట్ల రూపాయలు దానధర్మాలు చేస్తూ ఇన్ని నిందలు పడటం అనవసరమా అని ఈ నిర్ణయం తీసుకున్నానని, రాజకీయ జీవితానికి,వ్యాపార జీవితానికి ఎక్కడా సంబంధం లేదని,స్వార్థం కోసం రాజీనామా చేయడం లేదన్నారు.నిజాయితీపరుడైన తనపై ఇలా విష ప్రచారం చేయడం కరెక్ట్​ కాదని,తన పోరాటం కుటుంబ పాలనపైన అని,తన పోరాటం తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవం కోసమన్నారు.

కాంగ్రెస్​ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయలేకపోతుందని,ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని ఆరోపించారు.మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని,ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారని,అయినా ఏం చేయలేకపోయాయనని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకా 18 నెలల సమయం ఉండడంతో అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నానని తెలిపారు.నియోజకవర్గానికి కొంతైనా అభివృద్ధి జరుగుతుందనే రాజీనామా చేస్తానని,గతంలో కూడా అభివృద్ధి చేయకుంటే రాజీనామా చేస్తానని తన నియోజకవర్గ నేతలకు హామీ ఇచ్చానని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అమ్ముడు పోయారని కొంతమంది వ్యక్తులు బద్నాం చేస్తున్నారని,అమ్ముడుపోయే మనస్తత్వం తన రక్తంలో లేదని,ఆస్తులను అమ్మి సంపాదించిన సొమ్మును పేద ప్రజలకు ఇచ్చానని,సొంత డబ్బుతో కార్యకర్తలను కాపాడుకున్నానని అన్నారు.తప్పుడు ప్రచారాలతో విషయం చిమ్ముతున్నారన్నారు.

తప్పుడు ప్రచారాలతో తనను నమ్ముకున్న ప్రజలు ఆయోమయానికి గురవుతున్నారన్నారు.గతంలోనే తనను టీఆర్​ఎస్​ లోకి రావాలని పిలిచారని,వ్యక్తిత్వాన్ని అమ్ముకోనని, ఇక ముందుకు కూడా చేయనన్నారు.

అందుకే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.పోరాటంలో కాంగ్రెస్​ విఫలమైందని కాంగ్రెస్​ అధిష్టానంపైన రాజగోపాల్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్​ పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు చేయనని,గతంలో 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడితే కూడా ఏఐసీసీ నుంచి కనీసం సమీక్ష కూడా లేదన్నారు.ప్రస్తుతం మోడీ నాయకత్వంలో దేశం దూసుకుపోతుందని,మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

కాంగ్రెస్​ లో ఉండి చేసేదేమీ లేదని,తన పోరాటం టీఆర్​ఎస్​ పార్టీ మీద, ప్రభుత్వం మీద అని,కాంగ్రెస్​ పార్టీ సరైన రీతిలో పోరాటం చేయలేదని,అందుకే రాజీనామా చేస్తున్నానన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube